Share News

SVU-Raging: తిరుపతి SV యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం, HOD తీరుపై విమర్శలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:02 AM

తిరుపతి SVUలో మరోసారి ర్యాగింగ్ అంశం సంచలనమైంది. సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌కు గురిచేసినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై HODకి ఫిర్యాదు చేస్తే.. 'ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు'అంటూ..

SVU-Raging: తిరుపతి SV యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం, HOD తీరుపై విమర్శలు
SV University, Tirupati, Ragging

ఇంటర్నెట్ డెస్క్: తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం(SVU)లో మరోసారి ర్యాగింగ్ అంశం సంచలనమైంది. విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌కు గురిచేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు తమ బాధను HOD దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, విచిత్రంగా ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థుల పట్ల HOD అనుచితంగా మాట్లాడారని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.


'ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు'అంటూ HOD బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు యూనివర్శిటీలో విద్యార్థుల భద్రత పట్ల యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేస్తున్నాయని వారు మండిపడ్డారు. విభాగాధిపతి చేసిన వ్యాఖ్యలపై, ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.


విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా, ఫిర్యాదు చేసిన వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విభాగాధిపతిని తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్యాంపస్‌లో జూనియర్ విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించాలంటున్నారు. ఈ ఘటనతో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 10:13 AM