Share News

Adilabad Airport: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:04 AM

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Adilabad Airport: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Adilabad Airport

ఆదిలాబాద్, నవంబర్ 4: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల భూమి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో 6 ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టును సమర్పించింది. AAI రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ సాధ్యమని సూచించింది.


ఈ మేరకు భూమి స్వాధీన ప్రక్రియ ప్రారంభించాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 700 ఎకరాల భూమిని జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ కోసం సేకరించనున్నారు. విమానాశ్రయం అభివృద్ధికి ప్రభుత్వం, AAI, సివిల్ ఏవియేషన్ శాఖలు సమన్వయం పాటించాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షణలో ప్రాజెక్టు అమలు కానుంది.


ఇవి కూడా చదవండి:

Minister Jupally Krishna Rao: మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Chandrababu Naidu, London Visit: లండన్‌లో భారత హైకమిషనర్‌తో బాబు భేటీ..

Updated Date - Nov 04 , 2025 | 09:04 AM