Share News

Minister Jupally Krishna Rao: మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Nov 04 , 2025 | 08:03 AM

బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ, రాజీవ్‌నగర్‌ కాలనీ, జయంతి నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు.

Minister Jupally Krishna Rao: మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- బీఆర్‌ఎస్‌ అరాచకాలు ప్రజలకు తెలుసు..

- మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ, రాజీవ్‌నగర్‌ కాలనీ, జయంతి నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలిస్తే నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.


city4.3.jpg

మార్నింగ్‌ వాక్‌లో భాగంగా కల్పతరు అపార్ట్‌మెంట్‌ వాసులను కలిసి నవీన్‌ యాదవ్‌(Naveen Yadav)ను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం స్పోర్ట్స్‌ లాంచ్‌కు వెళ్లి జిమ్‌లో వ్యా యామం చేశారు. అక్కడున్న వారితో షెటిల్‌ ఆడారు. కార్యక్రమంలో డైరీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ సత్యం శ్రీరంగం, హైదర్‌నగర్‌ కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాస్‌, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగళ్ల నరసింహారావు పాల్గొన్నారు.


city4.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 08:03 AM