Share News

Adulterated liquor case: కల్తీ మద్యం కేసు.. జోగి రమేష్, రాము పిటిషన్‌పై నేడు విచారణ

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:03 AM

జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రామును సిట్, ఎక్సైజ్ అధికారులు 6వ ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరుగనుంది. కల్తీ మద్యం కేసులో వీరిద్దరిని సిట్, ఎక్సైజ్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసికేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Adulterated liquor case: కల్తీ మద్యం కేసు.. జోగి రమేష్, రాము పిటిషన్‌పై నేడు విచారణ
Adulterated liquor case

విజయవాడ, నవంబర్ 4: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రామును సిట్, ఎక్సైజ్ అధికారులు 6వ ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరుగనుంది. కల్తీ మద్యం కేసులో వీరిద్దరిని సిట్, ఎక్సైజ్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసికేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వీరిని విచారించేందుకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం జోగి రమేష్, జోగి రాము నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో మళ్ళీ నేడు విచారణ జరుగనుంది.


కల్తీ మద్యం కేసులో అరెస్టయిన జోగి రమేశ్‌, రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దర్నీ విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. ఆదివారం వీరిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో సుమారు 12 గంటలపాటు విచారించారు. రమేష్ తో ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావుతో సంబంధాలపై పలు ప్రశ్నలు సంధించారు. వైద్య పరీక్షల అనంతరం విచారణలో భాగంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు జరుగగా.. తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

TDP: ఇద్దరు పార్టీ నేతలకు టీడీపీ పిలుపు.. నేటితో వివాదానికి స్వస్తి!

SVU-Raging: తిరుపతి SV యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం, HOD తీరుపై విమర్శలు

Updated Date - Nov 04 , 2025 | 11:06 AM