TDP: ఇద్దరు పార్టీ నేతలకు టీడీపీ పిలుపు.. నేటితో వివాదానికి స్వస్తి!
ABN , Publish Date - Nov 04 , 2025 | 10:02 AM
మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ముందు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విడివిడిగా హాజరుకానున్నారు. గత నెలలో బహిరంగంగా మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్న తరుణంలో హాజరుకానున్నారు.
తిరువూరు, నవంబర్ 4: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ముందు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విడివిడిగా హాజరుకానున్నారు. గత నెలలో బహిరంగంగా మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల అనుచర గణం రోజూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే వీరికి పార్టీ నుంచి పిలుపువచ్చింది. ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు అనుచరులతో కాకుండా ఇద్దరూ వేరువేరుగా రావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆదేశించారు. దీంతో వీరిరువురూ పార్టీ కార్యాలయంలో కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ తరుణంలో ఇద్దరు నేతలు ఇచ్చే వివరణపై చర్యలు తీసుకుంటారా? లేదా? అని తిరువూరు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చేసుకున్న వ్యక్తిగత విమర్శలకు నేటితోనైనా తెరపడుతుందా? లేదా? అని టీడీపీ క్యాడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఇవి కూడా చదవండి:
Tragedy: ఏపీలో తీవ్ర విషాదం.. అన్నాదమ్ములు మృతి
YS Jagan Tour: నేడు జగన్ పర్యటన.. షరతులతో కూడిన అనుమతి