Tragedy: ఏపీలో తీవ్ర విషాదం.. అన్నాదమ్ములు మృతి
ABN , Publish Date - Nov 04 , 2025 | 09:28 AM
చిత్తూరు జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో గంట వ్యవధిలోనే అన్నదమ్ములు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో గంట వ్యవధిలోనే అన్నదమ్ములు మృతి చెందారు. పుంగనూరు బజారు వీధిలో అన్నదమ్ములు ఉంటున్నారు. బాత్రూంలో జారిపడ్డ తమ్ముడు రాధాకృష్ణను లేపే యత్నంలో పురుషోత్తం శెట్టికి డోర్ తగలి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే పురుషోత్తం శెట్టి (75), రాధాకృష్ణ శెట్టి (67) ఇద్దరూ చనిపోయారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాధాతప్త హృదయాలతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Chandrababu Naidu, London Visit: లండన్‌లో భారత హైకమిషనర్‌తో బాబు భేటీ..
Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు