Gachibowli Drug Case: హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీపై డీసీపీ రియాక్షన్..
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:10 PM
కో లివింగ్ హాస్టల్‌లో తేజ కృష్ణ, లోకేష్ రెడ్డి వద్ద డ్రగ్స్ లభించాయని డీసీపీ చెప్పారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురు.. హోటల్ నైట్ ఐలో దొరికారన్నారు.
హైదరాబాద్, నవంబర్ 4: నగరంలోని గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మాదాపూర్ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి (DCP Uday Reddy) మీడియాతో మాట్లాడుతూ.. మాదాపూర్ ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసులు ఎస్ఎం కో లివింగ్ హాస్టల్లో రైడ్ నిర్వహించారని తెలిపారు. కో లివింగ్ హాస్టల్‌లో తేజ కృష్ణ, లోకేష్ రెడ్డి వద్ద డ్రగ్స్ లభించాయని చెప్పారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురు.. హోటల్ నైట్ ఐలో దొరికారన్నారు. వారిని అదుపులోకి తీసుకున్నామని.. వారి వద్ద కూడా డ్రగ్స్ లభించినట్లు తెలిపారు. మొత్తం ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు ఫెడ్లర్లు, ఐదు మంది కన్యూమర్లు ఉన్నారన్నారు. బెంగళూరులో ఉంటున్న ఇద్దరు నైజీరియన్ల నుంచి తేజ కృష్ణ డ్రగ్స్ కొనుగోలు చేశారని డీసీపీ వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరు నైజీరియన్లు పరారీలో ఉన్నారని... వారిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చి తేజ లోకల్‌గా ఉన్న యువత, స్టూడెంట్‌లకు అమ్ముతారన్నారు. ఇప్పటివరకు అన్ని లావాదేవీలు కలెక్ట్ చేశామని.. నిందితులు రిమాండ్ చేసినట్లు చెప్పారు. పట్టుబడ్డ తేజ కృష్ణ ఆర్కిటెక్ట్ అని.. కడపకు చెందిన వ్యక్తిగా తెలిపారు. మొత్తం ఈ కేసులో 19 మంది ఉన్నారు..వారి 9 మంది ఫెడ్లర్లు ఉన్నారన్నారు. పరారీలో ఉన్నవారిలో నలుగురు ఫెడ్లర్లు ఉన్నారని చెప్పారు. తేజ కృష్ణపై గతంలో మూడు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయని డీసీపీ ఉదయ్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఏం చేస్తారో చేసుకోండి.. సీఐతో వైసీపీ నేత దురుసు ప్రవర్తన
డాక్టర్ డ్రగ్స్ దందా.. హైదరాబాద్‌లో కలకలం
Read Latest Telangana News And Telugu News