Home » Gachibowli
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్ రావు తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.
కో లివింగ్ హాస్టల్లో తేజ కృష్ణ, లోకేష్ రెడ్డి వద్ద డ్రగ్స్ లభించాయని డీసీపీ చెప్పారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురు.. హోటల్ నైట్ ఐలో దొరికారన్నారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అపార్ట్మెంట్ ఓనర్ను హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి చితకబాదాడు. అపార్ట్మెంట్లో తనకున్న 25 ప్లాట్లను హాస్టల్ నిర్వహించడానికి అద్దెకు ఇంటి యజమాని పిచ్చయ్య ఇచ్చాడు. కరోనాకు ముందు 25 ప్లాట్లను అద్దెకు ఇచ్చాడు.
ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాల రూపురేఖలను తమ ప్రభుత్వంలో మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. ఇంటిగ్రేటెడ్ సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నామని వ్యాఖ్యానించారు.
కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో అటవీ పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. అయితే, మంచి ప్రణాళికతో వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమే కాక సుమోటోగా తీసుకున్న చర్యలను కూడా ఉపసంహరించుకుంటామని సీజేఐ జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ(బుధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు ప్రభుత్వం ఆరు వారాలు గడువు కోరింది.
లైఫ్ సైన్సెస్ కేపిటల్గా హైదరాబాద్కు గుర్తింపు ఉందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పది శాతం తెలంగాణ నుంచే అందిస్తామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచే నలబై శాతం ఫార్మా ఉత్పత్తులు వస్తున్నాయని వెల్లడించారు. హైదరాబాద్లోనే అత్యధిక వ్యాక్సిన్ల తయారీ ఉందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఫార్మా కంపెనీలకు ప్రత్యేక జీనోమ్ వ్యాలీ ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలి ప్రాంతం ఎట్టిపరిస్థితుల్లోనూ అటవీ భూమి కానేకాదని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ భూములను కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) నివేదికలో అటవీ భూమిగా ప్రస్తావించడం సరికాదని.. తప్పుడు అంచనాల ప్రాతిపదికపై ఆ నిర్ధారణకు వచ్చిందని వివరించింది.
'భాయ్ బచ్చా ఆగయా భాయ్' వాట్సాప్ కోడ్ భాషతో గంజాయి సరఫరా చేస్తున్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఇదే కోడ్ ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ చేశారు. అంతే, ఆడామగా తేడాలేకుండా, ఫ్యామిలీలు సైతం..
ఇంట్లో దాచిన డబ్బును పెద్దవాళ్లకు తెలియకుండా ఆన్లైన్ జూదంలో పెట్టి కోల్పోయిన యువకుడు, ఆ డబ్బు గురించి మందలించాడని పగ పెంచుకొని కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపాడు.