Hyderabad: లక్ ఎవరిదో మరి.. 111 ప్లాట్లకు 2,685 దరఖాస్తులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:55 AM
హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఎల్‌ఐజీ ప్లాట్లకు నేడు లాటరీ తీయనున్నారు. మొత్తం 111 ప్లాట్లకుగానూ 2,685 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటికి సంబంధించి మంగళవారం లాటరీ తీయనున్నారు.
గచ్చిబౌలి ఎల్‌ఐజీ ప్లాట్లకు నేడు లాటరీ
హైదరాబాద్ సిటీ: అల్పాదాయ వర్గాల కోసం హౌసింగ్ బోర్డ్(Housing Board) ప్రత్యేకంగా కేటాయించిన వివిధ ప్రాంతాల్లోని ప్లాట్ల కొనుగోళ్లకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించిన ఎల్‌ఐజీ ప్లాట్లను విక్రయించేందుకు హౌసింగ్ బోర్డ్ డిసెంబర్ 16న నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 3,096 దరఖాస్తులు రాగా, గచ్చిబౌలిలోని 111 ప్లాట్ల కోసం 2,685 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఖమ్మం ఎల్‌ఐజీ ఇళ్ల దరఖాస్తుల గడువును ఈనెల 8వరకు పొడిగించారు. లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు చేసింది.

6న హైదరాబాద్(Hyderabad)లో, 8న వరంగల్, 10న ఖమ్మంలో ప్లాట్ల కేటాయింపులకు సంబంధించిన లాటరీ ప్రకియ్రను నిర్వహిస్తామని హౌసింగ్ బోర్డ్ అధికారులు తెలిపారు. గచ్చిబౌలి(Gachibowli) లాటరీ విధానాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని అన్నారు. దరఖాస్తుదారులు ఎక్కువగా ఉన్నందున కేంద్రంలో ప్రజలకు అనుమతి లేదన్నారు. ఉదయం రాంకీ ప్రాజెక్ట్‌లోని 76 ప్లాట్లకు, మధ్యాహ్నం వసంత ప్రాజెక్ట్‌లోని 35 ప్లాట్లకు ఈ లాటరీ నిర్వహిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..
బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారా..
Read Latest Telangana News and National News