Share News

Gachibowli Hostel owner Attack: హైదరాబాద్‌లో దారుణం.. యజమానిపై అమానుష దాడి

ABN , Publish Date - Aug 25 , 2025 | 06:14 PM

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అపార్ట్‌మెంట్ ఓనర్‌ను హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి చితకబాదాడు. అపార్ట్‌మెంట్‌లో తనకున్న 25 ప్లాట్లను హాస్టల్ నిర్వహించడానికి అద్దెకు ఇంటి యజమాని పిచ్చయ్య ఇచ్చాడు. కరోనాకు ముందు 25 ప్లాట్లను అద్దెకు ఇచ్చాడు.

Gachibowli Hostel owner Attack: హైదరాబాద్‌లో దారుణం.. యజమానిపై అమానుష దాడి
Gachibowli Hostel owner Attack

హైదరాబాద్, ఆగస్టు25 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అపార్ట్‌మెంట్ ఓనర్‌ను హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి (Amarnath Reddy) చితకబాదాడు. అపార్ట్‌మెంట్‌లో తనకున్న 25 ప్లాట్లను హాస్టల్ నిర్వహించడానికి అద్దెకు ఇంటి యజమాని పిచ్చయ్య ఇచ్చాడు. కరోనాకు ముందు 25 ప్లాట్లను అద్దెకు ఇచ్చాడు పిచ్చయ్య. నెక్స్ట్ జెన్ లేడీస్ హాస్టల్ పేరిట హాస్టల్ నిర్వహిస్తున్నాడు అమర్నాథ్ రెడ్డి. కరోనా అనంతరం అపార్ట్‌మెంట్ అద్దె చెల్లించకుండా మొండికేశాడు హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి. దీంతో హాస్టల్ ఖాళీ చేయాలంటూ ఇంటి ఓనర్ హుకుం జారీ చేశాడు. హాస్టల్ ఖాళీ చేయాలి అనడంతో కోర్టును ఆశ్రయించాడు అమర్నాథ్ రెడ్డి.


ఇంటి యజమాని కూడా కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో విచారణ అనంతరం గతంలో 9 ప్లాట్లు ఖాళీ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల సహకారంతో 9 ప్లాట్లను ఖాళీ చేయించాడు ఇంటి యజమాని. తాజాగా మరో మూడు ఫ్లాట్లు ఖాళీ చేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో మూడు ప్లాట్లు ఖాళీ చేయిస్తుండగా దాడికి తెగబడ్డాడు హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి. పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డాడు అమర్నాథ్ రెడ్డి.


అపార్ట్‌మెంట్‌ ఓనర్‌ పిచ్చయ్యకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం అమర్నాథ్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు గచ్చిబౌలి పోలీసులు. గచ్చిబౌలి పోలీసుల కళ్లు కప్పి పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు అమర్నాథ్ రెడ్డి. బిల్డింగ్‌లను అద్దెకు తీసుకొని అనంతరం కబ్జాలకు పాల్పడుతున్నాడు అమర్నాథ్ రెడ్డి. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ అండతో రెచ్చిపోతున్నాడు అమర్నాథ్ రెడ్డి. బాధితుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం

యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై సీఎం సీరియస్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 25 , 2025 | 06:19 PM