Share News

Bhoodan Lands In Yacharam: యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై సీఎం సీరియస్

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:00 PM

యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 250 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణ, ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద.. పరిహారం పొందిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Bhoodan Lands In Yacharam: యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై సీఎం సీరియస్
CM Revanth reddy

హైదరాబాద్, ఆగస్టు 25: యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 250 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణ, ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద.. పరిహారం పొందిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని రెవెన్యూ సెక్రటరీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

యాచారం మండలంలోని తాటిపర్తి పరిధిలో 104 సర్వే నెంబర్‌లో దాదాపు 250 ఎకరాల భూమిని కొందరు దాతలు 1955లో భూదాన్ యజ్జ బోర్డుకు అందజేశారు. 1997లో రాష్ట్ర ప్రభుత్వం.. 2006లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆ భూమిని భూదాన్‌గా గుర్తించి.. అందుకు సంబంధించిన సర్క్యూలర్లు జారీ చేశారు. ఈ మేరకు 2013లో యాచారం తాహసీల్దారుకు భూదాన్ యజ్ఞ బోర్డు లేఖ సైతం రాసింది. అయితే సదరు భూమిని కొనుగోలు చేశామంటూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు హక్కులు క్లెయిమ్ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఔషధ పరిశ్రమ కోసం చేపట్టిన భూసేకరణలో రెవెన్యూ అధికారులు పట్టాలుగా పరిగణించి.. ఎకరాకు రూ. 16 లక్షల చొప్పున రూ. 40 కోట్లు పరిహారం చెల్లించారు. మరోవైపు ఆ భూములను సాగు చేసుకుంటున్నామని.. పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే భూదాన్ భూములు ఇవ్వలేదంటూ స్థానికులు ఆరోపించారు. అంతేకాకుండా.. ఔషధ పరిశ్రమ భూసేకరణలో భాగంగా వేరెవరో హక్కులున్నట్లుగా చూపి పరిహారం కాజేశారని వారు ఆరోపించారు. అంటే 250 ఎకరాల భూమి ధర రూ. 400 కోట్ల వరకు ఉండ వచ్చని అంచనా వేస్తున్నారు.


యాచారం మండలం తాడిపర్తి పరిధిలో 104 సర్వే నంబరులో 250 ఎకరాల భూమిని కొందరు దాతలు 1955లో భూదాన్‌ యజ్ఞ బోర్డుకు అందజేశారు. 1997లో ప్రభుత్వం, 2006లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆ భూమిని భూదాన్‌గా గుర్తించి సర్క్యులర్లు జారీ చేశారు. ఈమేరకు 2013లో భూదాన్‌ యజ్ఞబోర్డు యాచారం తహసీల్దారుకు లేఖ కూడా రాసింది. అయితే.. ఈ భూమిని కొనుగోలు చేశామంటూ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు హక్కులు క్లెయిమ్‌ చేశారు. దీంతో ఔషధ పరిశ్రమ కోసం చేపట్టిన భూసేకరణలో రెవెన్యూ అధికారులు పట్టా భూమిగా పరిగణించి.. ఎకరాకు రూ.16 లక్షల చొప్పున రూ.40 కోట్ల పరిహారం చెల్లించారు.


మరోవైపు, ఆ భూములను సాగు చేసుకుంటున్నామని... పట్టాలకు దరఖాస్తు చేసుకుంటే భూదాన్‌ భూములంటూ ఇవ్వలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఔషధ పరిశ్రమ భూసేకరణలో వేరెవరో హక్కులున్నట్లు చూపి పరిహారం కాజేశారని వారు ఆరోపిస్తున్నారు. 250 ఎకరాల భూమి ధర రూ.400 కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఇంకోవైపు.. కందుకూరు మండలంలో రూ. కోట్లు విలువైన భూదాన్ భూములు కబ్జాకు గురైన వ్యవహారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

భూదాన్ భూముల వల్ల భారీగా ప్రభుత్వానికి నష్టం జరిగిందంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర నివేదిక అందించాలంటూ రెవెన్యూ శాఖ కారదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థిపై లాఠీ పడితే.. తెలంగాణ సమాజం ఊరుకోదు

ఫోనే కీలకం.. వారిలో మొదలైన అలజడి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 25 , 2025 | 12:26 PM