Share News

Supreme Court : కంచ గచ్చిబౌలి.. పర్యావరణ పరిరక్షణలో మంచి ఫలితాలుంటే అభినందిస్తాం.. సీజేఐ ప్రశంసలు

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:53 AM

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ(బుధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు ప్రభుత్వం ఆరు వారాలు గడువు కోరింది.

Supreme Court : కంచ గచ్చిబౌలి.. పర్యావరణ పరిరక్షణలో మంచి ఫలితాలుంటే అభినందిస్తాం.. సీజేఐ ప్రశంసలు
Kancha Gachibowli Land Case

హైదరాబాద్, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై (Kancha Gachibowli Land Case) ఇవాళ(బుధవారం) సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు ఆరు వారాలు గడువు కోరింది ప్రభుత్వం. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది సీజేఐ జస్టిస్ బీ.ఆర్ గవాయి ధర్మాసనం. అభివృద్దికి తాము అడ్డుకాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.


సుస్ధిర అభివృద్ధి ముఖ్యమని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. అభివృద్ధి చేసేటప్పుడు పర్యావరణ పరిరక్షణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తే తప్పకుండా మెచ్చుకుంటామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకొని మరింతగా ప్రశంసిస్తామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గణేశ్‌ మండపాల జియో ట్యాగింగ్‌ తప్పనిసరి

ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 11:58 AM