Share News

Electricity: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

ABN , Publish Date - Aug 13 , 2025 | 07:02 AM

మహేష్ నగర్‌, ఎంజే కాలనీ ఫీడర్‌ల పరిధిలో సాంకేతిక మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. మహేష్ నగర్‌ మార్కెట్‌ రోడ్‌, వాటర్‌ ట్యాంక్‌ ఏరియా, పరివార్‌ బ్యాక్‌ సైడ్‌, సీపీఎం ఆఫీస్‌ ఏరియా తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు.

Electricity: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

- నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదరాబాద్: మహేష్ నగర్‌(Mahesh Nagar), ఎంజే కాలనీ ఫీడర్‌ల పరిధిలో సాంకేతిక మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. మహేష్ నగర్‌ మార్కెట్‌ రోడ్‌, వాటర్‌ ట్యాంక్‌ ఏరియా, పరివార్‌ బ్యాక్‌ సైడ్‌, సీపీఎం ఆఫీస్‌ ఏరియా తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఎంజే కాలనీ రోడ్‌ నం-1,2,3, గాయత్రీనగర్‌ రోడ్‌ నెం-6,7,8,9,10, సాయిబాబా టెంపుల్‌ ప్రాంతం, ఎల్‌ఐజి-బి, శ్రీరాంనగర్‌, గ్జేవియర్‌ స్కూల్‌ ఏరియా, కుర్మ హోమ్స్‌ తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.


హైదరాబాద్: ఆజామాబాద్‌ డివిజన్‌(Azamabad Division) పరిధిలో బుధవారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. ఆజామాబాద్‌ ఐఈ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పరిధిలో 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


city1.2.jpg

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: టీఎస్ఎస్పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌(TSSPDCL Saroornagar Division) పరిధిలోని 11కేవీ ఆటోనగర్‌ ఇండస్ట్రీయల్‌, హుడాసాయినగర్‌, చాణక్యపురి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాలలో నిర్వహణ పనుల కారణంగా బుధవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడుతుందని డీఈ తెలిపారు. 11కేవీ ఆటోనగర్‌ ఇండస్ట్రీయల్‌, హుడాసాయినగర్‌, చాణక్యపురి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్‌ కోబ్రా

వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2025 | 07:02 AM