CP CV Anand: గణేశ్ మండపాల జియో ట్యాగింగ్ తప్పనిసరి
ABN , Publish Date - Aug 13 , 2025 | 07:48 AM
గణేశ్ నవరాత్రుల సందర్భంగా సెక్టార్ ఎస్‌ఐలు తమ పరిధిలో ఏర్పాటు చేసిన మండపాల పూర్తి వివరాలు సేకరించి జియో ట్యాగింగ్ చేయాలని నగర సీపీ సీవీ ఆనంద్ సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ సిటీ: గణేశ్ నవరాత్రుల సందర్భంగా సెక్టార్ ఎస్‌ఐలు తమ పరిధిలో ఏర్పాటు చేసిన మండపాల పూర్తి వివరాలు సేకరించి జియో ట్యాగింగ్ చేయాలని నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) సూచించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయం నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారుల నుంచి ఎస్సైల వరకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఇన్‌స్పెక్టర్‌లు(Inspectors) మండపాల నిర్వాహకులతో తరచూ సమావేశాలు నిర్వహించి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషల్ సీపీలు విక్రమ్‌సింగ్ మాన్, పి.విశ్వప్రసాద్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, పరిమళాహనా నూతన్, డీసీపీ అపూర్వారావు, పుష్పతోపాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News