ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BRS VS Congress: తెలంగాణలో హాట్ హాట్‌గా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:05 PM

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది.

BRS VS Congress Political War

హనుమకొండ: తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయాలు భగ్గుమన్నాయి. మాటల తూటాలతో రెండు పార్టీల్లోని నేతలు రెచ్చిపోయారు. భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపణలు చేశారు. వినయ్ భాస్కర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టెండర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయని వినయ్ భాస్కర్‌ అన్నారు. పూడికతీత పనుల్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని ఆయన చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని చర్చకు రమ్మను తాను సిద్ధమని నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. గతంలో కుడాకు ఒక రూపాయి అయినా నిధులు తెచ్చినట్టు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని నాయిని రాజేందర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులు వీళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని నాయిని రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల పరిస్థితి దొంగే దొంగా అన్నట్లుగా ఉందని విమర్శించారు. వరంగల్‌లో కుడా నిధులు దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెడతామని హెచ్చరించారు. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ చీడ పురుగులలాంటి వాళ్లు... వీళ్లను వెంటనే జైళ్లో పెట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇక్కడి బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌కి పారిపోతారని నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్

ముగిసిన నిషేధ కాలం.. అర్ధరాత్రి నుంచి చేపల వేటకు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 12:23 PM