ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: అందుకే పాదయాత్ర చేస్తున్నాం.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 03 , 2025 | 05:28 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే పాదయాత్ర ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఈ పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు చేరువయ్యేందుకే పాదయాత్రలు చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు.

TPCC President Mahesh Kumar Goud

నిజామాబాద్: స్థానికల సంస్థల ఎన్నికలపై (Local Body Elections) టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే ఆధారంగా స్థానిక ఎన్నికల్లో గెలిచే వారికే సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పదవులు ఇస్తామని ఉద్ఘాటించారు. కొత్త వారు వచ్చినా పాత నేతలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకొచ్చారు. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ఇవాళ(ఆదివారం) నిజామాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.

పాలనలో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీపై అధ్యయనం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే పాదయాత్ర ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు చేరువయ్యేందుకే పాదయాత్రలు చేస్తున్నామని ఉద్ఘాటించారు మహేష్ కుమార్ గౌడ్.

మాజీ సీఎం కేసీఆర్ అప్పులు చేసి ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్‌వి కుల రాజకీయాలని ఆక్షేపించారు. బనకచర్ల ప్రాజెక్టుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా ఎల్లో జర్నలిజం నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా ఏనాడైనా బీసీల గురించి కవిత మాట్లాడారా అని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు కొత్త చరిత్రను సృష్టించాయి: వెంకయ్యనాయుడు

ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 05:31 PM