ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: కేసీఆర్‌ కుట్రలతోనే తెలంగాణ ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయి.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

ABN, Publish Date - Jun 24 , 2025 | 07:47 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ చెప్పాకే బనకచర్లపై ఏపీ ముందుకు వెళుతోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్ట్‌లు ఆగిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుట్రలతోనే తెలంగాణ ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయని ఆరోపించారు. ప్రాజెక్ట్‌లు కొట్టుకుపోవడానికి కారణం కేసీఆర్ కాదా అని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.

Telangana CM Revanth Reddy

హైదరాబాద్: గోదావరి జలాలపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ పెడతాం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (BRS Chief KCR) సిద్ధమా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) సవాల్ విసిరారు. ప్రాజెక్ట్‌ల పేరు, ఊరు మార్చి కేసీఆర్‌ లక్ష కోట్లు కొల్లగొట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు సీమాంధ్ర పాలకులు తెలంగాణను ఏడారిగా మార్చారని కేసీఆర్‌ అన్నారని చెప్పారు. తాను చంద్రబాబుతో ఉండాలనుకుంటే టీడీపీలోనే ఉండేవాడినని.. తెలంగాణ కోసమే రాహుల్‌‌గాంధీ ఆశీస్సులతోనే కాంగ్రెస్‌లోకి వచ్చానని ఉద్ఘాటించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన 18 నెలల కాంగ్రెస్‌ పాలనను బేరీజు వేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

కేసీఆర్‌ చెప్పాకే బనకచర్లపై ఏపీ ముందుకు..

ఇవాళ(మంగళవారం) సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ చెప్పాకే బనకచర్లపై ఏపీ ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్ట్‌లు ఆగిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుట్రలతోనే తెలంగాణ ప్రాజెక్ట్‌లు ఆగిపోయాయని ఆరోపించారు. ప్రాజెక్ట్‌లు కొట్టుకుపోవడానికి కారణం కేసీఆర్ కాదా అని నిలదీశారు. రైతుల ఆశీర్వాదంతోనే తాను చిన్న వయస్సులో సీఎం అయ్యానని ఉద్ఘాటించారు. భూమి కేంద్రంగానే సాగిన జీవితం.. తెలంగాణ రైతాంగ జీవితమని అభివర్ణించారు. భూమి చుట్టూనే తెలంగాణలో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి.. వ్యవసాయం పండగ అనే పరిస్థితి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

రైతులకు ఉచిత విద్యుత్‌ అందించింది కాంగ్రెస్‌ పార్టీనే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత రైతులేనని తేల్చిచెప్పారు. కేసీఆర్‌ ఎగవేసిన రైతు భరోసా నిధులను తాము ఇచ్చామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.20,600 కోట్లతో రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. రైతుబంధు ఇచ్చేందుకు నాడు భూములు అమ్మారని ఆరోపించారు. రుణమాఫీ కోసం అవుటర్‌ రింగ్‌ రోడ్డును కూడా అమ్మేశారని మండిపడ్డారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటాలు జరిగేవని అన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయాలని అభ్యర్థులు పోరాటాలు చేస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

వ్యవసాయాన్ని పండగ చేశాం..

రైతు భరోసాని తొమ్మిదిరోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. 1600రైతు వేదికల వద్ద 71లక్షల మంది రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితుల నుంచి పండగ చేశాం. మా మొదటి ప్రాధాన్యం రైతులు, మహిళలు, తెలంగాణ ఉద్యమ కారులు, విద్యార్థులు. ఎన్నికలప్పుడు 2లక్షల్లోపు రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్పాం. చెప్పినట్లే 25లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం. కేసీఆర్ వరి వేస్తే ఉరి అని చెప్పారని... మేం వరి కొనుగోలు చేస్తాం అని చెప్పాం. పండించి ప్రతి గింజను కొనుగోలు చేశాం. సన్న వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేశాం. కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేన్సర్ బారిన పడేశారు. శకుని మామకు శనీశ్వర అల్లుడు దొరికిండు. రూ.8లక్షల కోట్ల అప్పులు చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని మాకు ఇచ్చారు. భూములు అమ్ముకుని జేబులు నింపుకున్నారు. హరీష్‌రావుకు మొయినాబాద్‌లో, కేటీఆర్‌కు జన్వాడలో, కేసీఆర్‌కు గజ్వేల్‌లో ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు శ్రీమంతులు ఎలా అయ్యారు. రాష్ట్రం ఎందుకు దివాళా తీసింది. నేను వచ్చాక 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తా. కేసీఆర్ పదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. మేం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా కేసీఆర్. కాళేశ్వరం పేరిట మీరు లక్ష కోట్లు దోచుకున్నారు. మేం రైతుల కోసం లక్ష 40వేల కోట్లు ఖర్చు చేశాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

కేసీఆర్‌వీ కుట్రలు, కుతంత్రాలు..

‘కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలతో కృష్ణా నదిపై మొదలు పెట్టిన ఏ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గోదావరిలో కొట్టుకుపోవడానికి కేసీఆర్ అవినీతి కారణం కాదా. నిన్ను ఉరి తీసినా తప్పులేదని అక్కడి రైతులు అంటున్న మాట వాస్తవం కాదా. లక్ష కోట్లు కొల్లగొట్టి వేల కోట్లు చేరబట్టారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెడదాం వస్తావా. తేదీ చెప్పండి అదే రోజు అసెంబ్లీ పెడదాం. నువ్వు ఇచ్చిన సలహాతోనే కదా బనకచర్ల దరిద్రం దాపురించింది. రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్న సన్నాసి నువ్వు కాదా కేసీఆర్. నీ అల్లుడితో మాట్లాడించడం కాదు.. నువ్వు చర్చకు రా. స్పీకర్‌కు లేఖ రాయి.. అసెంబ్లీలో చర్చిద్దాం. ఒక రోజు కృష్ణాపై, మరో రోజు గోదావరి నీళ్లపై చర్చిద్దాం. కృష్ణాలో 512 టీఎంసీల నీరు ఏపీకి రాసిచ్చింది, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నువ్వు కాదా. ఏపీ పట్టిసీమ కట్టింది, రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చింది నీ హయాంలో కాదా. తెలంగాణకు మరణ శాసనం రాసింది నువ్వు కాదా. నీకు మొహం చెల్లక ఫాంహౌస్‌లో పడుకున్నావ్. బీఆర్ఎస్ చచ్చిన పాము. అది ఇంకా అధికారంలోకి రాదు. మీరు ఏపీకి సహకరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని కేంద్ర ప్రభుత్వానికి చెప్పి వచ్చాం. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు తీసుకెళ్తాం. యువకులను ఆదుకుంటాం. 2033వరకు మేమే అధికారంలో ఉంటాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌లో దారుణం.. కన్న కూతురుపై

రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్

ఏపీలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు అమోదం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 08:16 PM