Hyderabad Fire Incident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN, Publish Date - May 18 , 2025 | 09:34 AM
Hyderabad Fire Incident: హైదరాబాద్‌లో ఆదివారం నాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: చార్మినార్ పోలీస్ స్టేషన్(Charminar) పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంట్లో ఏర్పాటు చేసిన ఏసీ కంప్రెషర్ పేలి మంటలు చెలరేగినట్లు (Fire Accident) అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఘటనా స్థలిలోనే నలుగురు చనిపోగా.. మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మరికొంతమంది గాయపడగా.. క్షతగాత్రులను మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి, అపోలో, డీఆర్డీవో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగింది..
ఆదివారం గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 15మందికి పైగా చిక్కుకున్నారు. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైరింజన్ సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే మంటల్లో చిక్కుకున్న వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలోనూ ఐదుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
స్థానికుల భయాందోళనలు..
ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు భారీగా చెలరేగాయి. ప్రమాదం చోటు చేసుకున్న బిల్డింగే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల తీవ్రత అధికంగా ఉండటం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లను బ్లాక్ చేశారు. ఫైర్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
బాధితులను పరామర్శించిన కేంద్రమంత్రి..
అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటానని.. అధైర్య పడవద్దని బాధితులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధైర్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Telangana: చీఫ్ మినిస్టర్ ఓ ఎస్ డీ అంటూ వ్యాపారులకు వల..
High Court: లిఫ్ట్ ప్రమాదాలపై సుమోటో విచారణ
Naxalism: నక్సల్స్ మూలాలపై దెబ్బ..
Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 18 , 2025 | 11:43 AM