TG News: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో మహేష్ గౌడ్ భేటీ.. ఏం చర్చించారంటే..
ABN, Publish Date - May 26 , 2025 | 08:43 PM
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మహేష్ కుమార్‌గౌడ్ చర్చించారు.
హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో (Rahul Gandhi) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మర్యాద పూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు మహేష్ కుమార్. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించానని తెలిపారు.
వీలైనంత త్వరగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని కోరానని.. త్వరగా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని మహేష్ కుమార్ అన్నారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై ఈరోజు సమావేశం ఉంటుందా లేదా అనేది తెలియదని చెప్పారు. ఈరోజు, రేపటిలోగా పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఒకటి, రెండుసార్లు తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపామని అన్నారు. తెలంగాణ కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని అధిష్టానానికి కోరామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న
బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 26 , 2025 | 09:02 PM