Mahesh Goud: ఆ విషయంపై దమ్ముంటే లేఖ రాయాలి.. కేటీఆర్‌కు మహేష్‌గౌడ్ మాస్ సవాల్
ABN, Publish Date - May 22 , 2025 | 04:31 PM
Mahesh Goud: మాజీ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి మాయమైనట్లు కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు మహేష్‌కుమార్ గౌడ్.
హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై (Palamuru Rangareddy Lift Irrigation Scheme) మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినట్లు, తామంతా నీతిమంతులైనట్లు చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్ లో మీడియాతో మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఈ పథకంపై కోర్టులో కేసు వేశారని గుర్తుచేశారు మహేష్‌కుమార్ గౌడ్.
ఆయన పూర్తి ఆధారాలతో ఆ రోజు న్యాయస్థానంలో కేసు వేశారని మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నాగం జనార్ధన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఆ కేసును నీరుగార్చేలా, వీగిపోయేలా వ్యవహారించారని ధ్వజమెత్తారు. నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నారని.. అలాంటిది కేసీఆర్‌పై ఎలా కొట్లాడతారని ప్రశ్నించారు. తామంతా నీతిమంతులమని, బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి మాయమైనట్లు కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసి ఏ విచారణ కావాలో అడగాలని కోరారు. ధైర్యం ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఐడీ విచారణ కావాలా? జ్యూడిషియల్ విచారణ కావాలా అన్నది ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాయాలని సవాల్ విసిరారు. అప్పుడు అవినీతి ఏవిధంగా జరిగిందో బట్టబయలవుతుందని స్పష్టం చేశారు. నిజాయితీని నిరూపించుకునేందుకు కేటీఆర్ ముందుకు రావాలని మహేష్‌కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
SIT Notice Prabhakar: ప్రభాకర్ రావుకు ఇంటికి పోలీసులు.. ఎందుకంటే
Kishan Reddy Vs KTR: కేటీఆర్‌పై కిషన్‌రెడ్డి సీరియస్
ఇందిరా మహిళా శక్తి బజార్‌కు సుందరీమణులు
గుల్జార్ హౌస్ ప్రమాదానికి అసలు కారణం ఇదే
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 22 , 2025 | 04:32 PM