ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavitha: మేడే స్పూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోయేలా కృషి చేయాలి

ABN, Publish Date - May 01 , 2025 | 02:30 PM

MLC Kalvakuntla Kavitha: మేడే సందర్భంగా కార్మికులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.

MLC Kalvakuntla Kavitha

హైదరాబాద్: భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటకీ.. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడే సందర్భంగా కార్మికులకు కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ(గురువారం) తెలంగాణ భవన్‌లో కవిత మీడియాతో మాట్లాడారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులుండాలని చెప్పారు. మేడే స్పూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవటానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు.


రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ. 8లక్షలు ఉంటే.. వికారాబాద్‌లో లక్ష 58వేలు మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. పది‌ కిలోమీటర్లు దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండటం ప్రమాదకరమని అన్నారు. అసమానతలు తొలగిపోవడానికి మేడే స్పూర్తి కావాలని చెప్పారు. రైతుబంధు కింద ఎకరం ఉంటే రూ.10 వేలు.. పది ఎకరాలుంటే లక్ష రూపాయలు ఇచ్చామని.. కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని తెలిపారు. భవిష్యత్తులో భూమి ఉన్నా.. లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మెకు జాగృతి మద్దతు ఇస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.


అధికారం కోసం దిగజారే నైజం రేవంత్ రెడ్డిది: జగదీష్‌రెడ్డి

సూర్యాపేట: సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం రేవంత్‌రెడ్డి పేరు మరచిపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి విమర్శలు చేశారు. ఇవాళ(గురువారం) సూర్యాపేట మునిసిపల్ ఆఫీస్ వద్ద మేడే జెండాను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఎగుర వేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక్క మంచి పని చేయని రేవంత్‌రెడ్డి పేరును ప్రజలు ఎందుకు గుర్తు పెట్టుకుంటారని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు.


రేవంత్ వల్ల బాధించబడ్డ వారే ఆయనను ఓడిస్తారని జగదీష్‌రెడ్డి అన్నారు. ముమ్మాటికీ తెలంగాణకి కాంగ్రెసే విలన్ అని ఆక్షేపించారు. అధికారం కోసం దిగజారే నైజం రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. పదేళ్లు తమదే అధికారమన్న వాళ్లకు కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. ఎన్ని రోజులు పదవిలో ఉంటాడో రేవంత్‌‌రెడ్డికే తెలవదని ఎద్దేవా చేశారు. అమలుకాని హామీలు ఇచ్చి అమలు చేయలేకే బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

Revanth On Caste Census: మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్రానికి రేవంత్ సూచన

Amazon Placement: ఆ స్టూడెంట్ ప్యాకేజ్‌ చూస్తే కళ్లు చెదరాల్సిందే.. ప్రియాంక సక్సెస్ స్టోరీ

BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2025 | 02:40 PM