Share News

Revanth On Caste Census: మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్రానికి రేవంత్ సూచన

ABN , Publish Date - May 01 , 2025 | 12:06 PM

Revanth On Caste Census: కుల గణనపై తెలంగాణ రాష్ట్రానికి అవగాహన ఉందదని సీఎం రేవంత్ అన్నారు. కుల గణన కోసం దేశ వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉందని తెలిపారు.

Revanth On Caste Census:  మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్రానికి రేవంత్ సూచన
CM Revanth Reddy On Caste Census

హైదరాబాద్, మే 1: దేశవ్యాప్తంగా జనగణననతో పాటు కులగణన (Caste Census) చేస్తామంటూ కేంద్రం (Central Govt) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కులగణన నిర్ణయం విషయంలో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని.. రాహుల్ పాదయాత్రలో కుల గణనపై చర్చ చేశారన్నారు. కుల గణన చేయాల్సిందేనని రాహుల్ తేల్చి చెప్పారని తెలిపారు. కేంద్రం నిర్ణయంపై రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని వెల్లడించారు.


కుల గణనపై తెలంగాణ రాష్ట్రానికి అవగాహన ఉందన్నారు. కుల గణన కోసం దేశ వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉందని తెలిపారు. కుల గణన కోసం మంత్రులతో ఒక కమిటీ ఏర్పడి చేయాలని.. అధికారులతో, నిపుణులతో ఒక కమిటీ వేసి అధ్యయనం చేయాలని సూచించారు. కులగణన కోసం తెలంగాణ మోడల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రానికి తెలిపారు. మంత్రుల కమిటీ వెంటనే నియమించాలన్నారు. మంత్రుల కమిటీకి తోడుగా నిపుణుల కమిటీని వేయాలన్నారు. ఈ రెండు కమిటీలతో దేశవ్యాప్తంగా అధ్యయనం చేయించాలని తెలిపారు. తూతూ మంత్రంగా కుల గణన చేస్తే దానితో ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చారు. కుల గణన దేశాన్ని జిరాక్స్ తీసినట్టు అవుతుందన్నారు. జిరాక్స్ తీస్తే రోగం ఏంటి? ఏ మందు వేయాలి అని తెలుస్తుందని తెలిపారు.

May Day wishes: కార్మికులకు సీఎం చంద్రబాబు, లోకేష్ మేడే శుభాకాంక్షలు


తాము ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి అనేక విషయాలు, సూచనలు తీసుకొని కులగణన చేశామన్నారు. కుల గణన కోసం 95,000 ఎన్యూమరేటర్లను నియమించామని.. పది మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్ వైజర్‌ను నియమించినట్లు చెప్పారు. మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించిందన్నారు. కుల గణన చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్‌లో పెట్టామని.. కుల గణనలో పాల్గొనని వాళ్ళకి మరోసారి అవకాశం ఇచ్చామన్నారు. మూడు నెలల్లోనే ఎలాంటి ఇబ్బందులు రాకుండా కుల గణన చేశామని తెలిపారు. కుల గణన విషయంలో కేంద్రంతో కలిసి నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కుల గణన విషయంలో కేంద్రానికి వచ్చే సందేహాలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 1931 తర్వాత కుల గణన చేసింది తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు. కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.


తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. కుల గణన ఎప్పుడూ మొదలు పెడతారో మోదీ చెప్పాలన్నారు. ఎప్పటి లోగా కుల గణన చేస్తారని ప్రశ్నించారు. కుల గణన సీక్రెట్ డాక్యుమెంట్ కాదని.. కుల గణన విధివిధానాలు బయట పెట్టాలన్నారు. 50 శాతం పరిధి పెంచి రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పెట్టి ఆమోదించామన్నారు. తెలంగాణ బలహీన వర్గాల తరఫున రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. రాహుల్ సూచనల మేరకు కుల గణన నిర్వహించామని.. కుల గణన క్రెడిట్ రాహుల్ గాంధీదే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

Amazon Placement: ఆ స్టూడెంట్ ప్యాకేజ్‌ చూస్తే కళ్లు చెదరాల్సిందే.. ప్రియాంక సక్సెస్ స్టోరీ

BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2025 | 12:06 PM