Jagga Reddy: రాహుల్ గాంధీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం.. ఎంపీ రఘునందన్ రావుకి జగ్గారెడ్డి మాస్ వార్నింగ్
ABN, Publish Date - May 30 , 2025 | 08:44 PM
రఘునందన్ ఇంకోసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడితే తాను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ చరిత్ర గురించి రఘునందన్‌కి ఏం తెలుసని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై (MP Raghunandan Rao) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై రఘునందన్ రావు పరిధి దాటి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఏది పడితే అది మాట్లాడవద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మొట్టికాయలు వేస్తే.. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని విమర్శిస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు జగ్గారెడ్డి.
కాంగ్రెస్ చరిత్ర గురించి రఘునందన్‌కి ఏం తెలుసని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 544 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని గుర్తుచేశారు. రఘునందన్ ఇంకోసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరించారు. బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడితే తాను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. పీఏసీ కమిటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకి ఏ కమిటీలో అవకాశం ఇచ్చినా సంతోషమేనని తెలిపారు. గాంధీ భవన్‌లో ఏ చిన్నపదవి ఇచ్చినా చేస్తానని స్పష్టం చేశారు. సీనియర్లకు అడ్వైజరీ కమిటీలో చోటు కల్పించడం మంచి పరిణామమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కరీంనగర్ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 30 , 2025 | 08:48 PM