Heavy Rain: గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:58 PM
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
హైదరాబాద్: భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని (Greater Hyderabad) పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భాగ్యనగరంలోని నాంపల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అబిడ్స్, కోటి, గోషామహల్, చార్మినార్, మలక్‌పేట్, చాదర్ ఘాట్‌లలో కుండపోతగా వర్షం పడుతోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో పాటు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోండటంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. కాలనీలను వర్షపు నీరు ముంచెత్తడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోండటంతో ప్రజల కార్యకలాపాలు నిలిచిపోయాయి.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం నెలకొంది. ఈదురు గాలులతో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. చాలా కాలనీల్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. వర్షం కురుస్తోండటంతో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ , మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో నిన్న(గురువారం) పడిన వర్షానికి అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌తో పాటు డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
త్వరలో కాళేశ్వరంపై సర్కారుకు నివేదిక
గుట్ట ప్రధాన కూడళ్లలో దేవుళ్ల విగ్రహాలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jun 13 , 2025 | 02:27 PM