ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: దత్తాత్రేయ జెంటిల్‌మ్యాన్‌కు ప్రతి రూపం.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ABN, Publish Date - Jun 08 , 2025 | 01:56 PM

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయది పేరుకు హిందుత్వం... మతం భారతీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అలయ్‌ బలయ్‌ అంటే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రేయ అని అభివర్ణించారు.

హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Haryana Governor Bandaru Dattatreya) జెంటిల్ మ్యాన్‌కు ప్రతి రూపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Nara Chandrababu Naidu) ప్రశంసించారు. దత్తన్న అని ప్రేమగా పిలుచుకుంటారని గుర్తుచేశారు. నలభై ఏళ్ల క్రితం పాత రోజులు ఇప్పుడు గుర్తుకువస్తున్నాయని చెప్పారు. సాధారణ వ్యక్తి జాతీయ స్థాయికి ఎదగడం మాములు విషయం కాదని ఉద్ఘాటించారు. దత్తాత్రేయది పేరుకు హిందుత్వం... మతం భారతీయమని వ్యాఖ్యానించారు. అలయ్‌ బలయ్‌ అంటే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రేయ అని అభివర్ణించారు. దత్తాత్రేయ కోరుకున్నది జనహితం... ఆయనది లౌకికవాదమని కొనియాడారు. లేఖలు రాయడంలో దత్తాత్రేయ అంబాసిడర్‌గా నిలిచారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

గౌలీగూడ గల్లీ నుంచి హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ఎదిగారు: రేవంత్‌రెడ్డి

గౌలీగూడ గల్లీ నుంచి హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ఎదిగారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. జాతీయ స్థాయిలో వాజ్‌పేయికి ఉన్న గౌరవం.. రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉందని ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడినా ఎప్పుడూ వాజ్‌పేయికి గౌరవం తగ్గలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ (ఆదివారం) జరిగింది. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో దత్తాత్రేయ పుస్తకం రచించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌‌రెడ్డి, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌, ఒడిశా గవర్నర్‌ హరిబాబు, త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏపీ మంత్రి సత్యకుమార్‌, పలు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

రాజకీయాల్లో నీతి, నిజాయితీ... సిద్ధాంతాలు ముఖ్యం: వెంకయ్యనాయుడు

బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ పుస్తకావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ రచించారని తెలిపారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ... సిద్ధాంతాలు ముఖ్యమని ఉద్ఘాటించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. రాజకీయ విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని చెప్పారు. అసభ్యంగా మాట్లాడే వారికి ఎన్నికల్లో సరైన జవాబివ్వాలని వెంకయ్యనాయుడు తెలిపారు.

హైటెక్‌ సిటీ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారు:మంత్రి కోమటిరెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. హైటెక్‌ సిటీ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని.. ఆయన ముందుచూపునకు ఇది నిదర్శనమని కొనియాడారు. బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

అది ఈటల స్టాండ్‌.. బీజేపీ స్టాండ్‌ కాదు

హైదరాబాద్‌లో 4 ట్రాన్సిట్‌ కారిడార్లు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 07:10 AM