Share News

Kishan Reddy: అది ఈటల స్టాండ్‌.. బీజేపీ స్టాండ్‌ కాదు

ABN , Publish Date - Jun 08 , 2025 | 06:43 AM

కాళేశ్వరం కమిషన్‌ బీజేపీ వైఖరి ఏమిటని ఈటలను అడగలేదని స్పష్టం చేశారు. ‘‘ఈటల స్టాండ్‌.. బీజేపీ స్టాండ్‌ కాదు. ఆయన బీజేపీ ఎంపీగా అక్కడ హాజరుకాలేదు. బీఆర్‌ఎ్‌సలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అదే చెప్పారు.

Kishan Reddy: అది ఈటల స్టాండ్‌.. బీజేపీ స్టాండ్‌ కాదు

కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలకుపార్టీ కట్టుబడి ఉందని వెల్లడి

కాళేశ్వరం కమిషన్‌ ఎదుట ఎంపీ ఈటల రాజేందర్‌ ఇచ్చిన వివరణతో బీజేపీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం కమిషన్‌ బీజేపీ వైఖరి ఏమిటని ఈటలను అడగలేదని స్పష్టం చేశారు. ‘‘ఈటల స్టాండ్‌.. బీజేపీ స్టాండ్‌ కాదు. ఆయన బీజేపీ ఎంపీగా అక్కడ హాజరుకాలేదు. బీఆర్‌ఎ్‌సలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అదే చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తనకు తెలిసినదేమిటో కమిషన్‌ ఎదుట చెప్పారు. తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా విచారణకు వెళ్లారు’’ అని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు వచ్చింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కమిషన్‌ను కలుస్తామని, తమ వైఖరి చెబుతామని వెల్లడించారు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌ బయటికి వచ్చి ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగకరమో చెప్పాలని సవాల్‌ చేశారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 06:44 AM