Home » Bandaru Dattatreya
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు.
అక్టోబరు 22న హైదరాబాద్‌లో జరగనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుకు బండారు దత్తాత్రేయ ఆహ్వానం అందించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో పెద్ద ప్రకటనలు తప్ప పనులు మాత్రం సాగడం లేదని బీజేపీ సీనియర్ నేత, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ రోజు (ఆదివారం) విశాఖ మద్దిలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్‌లోని నసీరుద్దీన్ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ తదితరులు పరామర్శించారు.
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయది పేరుకు హిందుత్వం... మతం భారతీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అలయ్ బలయ్ అంటే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రేయ అని అభివర్ణించారు.
రాజకీయాలకతీతంగా కిషన్‌రెడ్డిని అప్పుడప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానన్న ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు.
కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన శ్రీనగర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాలవల్ల ఆయన తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అదే విధంగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ఆత్మకథ ‘జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ’ పుస్తకావిష్కరణను వాయిదా వేశారు.
Vidyasagar Rao: తాను రచయితను కాదు... తనకు రచనలు రావు అని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తెలిపారు. తాను సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాశానని గుర్తుచేసుకున్నారు.