ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: కేసీఆర్‌తో హరీష్‌రావు కేటీఆర్ కీలక భేటీ.. ఎందుకంటే

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:10 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకంట్ల చంద్రశేఖర్‌రావుని నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు చర్చించారు.

Harish Rao KTR Key Meeting with KCR

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకంట్ల చంద్రశేఖర్‌రావుని (KCR) నందినగర్ నివాసంలో మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్‌రావు (Harish Rao) ఇవాళ(సోమవారం, జులై14)న భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావు చర్చించారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న‌ వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాగా.. ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మధ్య రాజకీయంగా వైరం నడుస్తోంది. సంగారెడ్డిలో జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఇటీవల మల్లన్న పాల్గొన్నారు. ఆ సభలో కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీలతో కవితకి ఏం సబంధమని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్‌లపై రేవంత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తే కవిత సంబురాలు ఎందుకు చేసుకుంటుందని నిలదీశారు. ఈ క్రమంలో మల్లన్న చేసిన వ్యాఖ్యలను కవిత తీవ్రంగా ఖండించారు.

ఈ నేపథ్యంలోనే నిన్న(ఆదివారం) మల్లన్నకి సంబంధించిన క్యూ న్యూస్ మీడియా కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై మల్లన్న మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఈ దాడి చేశామని, మల్లన్న వెంటనే కవితకి క్షమాపణలు చెప్పాలని జాగృతి కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే ఈ దాడిని అడ్డుకోవడానికి మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జాగృతి కార్యకర్తకి గాయాలయ్యాయి. ఆ తర్వాత కవిత, మల్లన్నలు పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కవిత కలిశారు. ఎమ్మెల్సీగా మల్లన్నని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ పరిణామాలతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను కేటీఆర్, హరీష్‌రావు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి

వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..

నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 01:16 PM