ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్‌

ABN, Publish Date - May 16 , 2025 | 02:57 PM

CM Revanth Reddy: విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నాడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. విద్యుత్ లైన్ల ఆధునీకికరణపైన దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

CM Revanth Reddy

హైదరాబాద్: భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే 9.8 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని అన్నారు. 2025, 2026లో 18,138 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు.


2034 , 2035 నాటికి 31,808 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అన్నారు. వచ్చే మూడేళ్లు విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. రైల్వేలైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్‌ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


విద్యుత్ లైన్ల ఆధునీకికరణపైన దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదని ఆదేశించారు. హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్‌ను తీసుకురావాలని చెప్పారు. 160 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్‌పాత్‌లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Konda Surekha Comments: కామన్‌గా చెప్పా.. నా వ్యాఖ్యలు వక్రీకరించారు

MP Chamala: యూట్యూబ్ చానల్స్‌తో కేటిఆర్ తప్పుడు ప్రచారం...

Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్.. అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు

Hyderabad: మాజీఎంపీ మధుయాష్కీ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 03:26 PM