Konda Surekha Comments: కామన్‌గా చెప్పా.. నా వ్యాఖ్యలు వక్రీకరించారు
ABN , Publish Date - May 16 , 2025 | 12:41 PM
Konda Surekha: గోరంతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్‌తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌ను కావాలని ట్రోల్ చేస్తున్నారన్నారు.

వరంగల్, మే 16: ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు వసూలు చేస్తారని.. కానీ తాను అలా చేయను అంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రులపై ఆమె చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి. అయితే ఈ కామెంట్స్‌పై మరోసారి స్పందించారు మంత్రి కొండా సురేఖ. ‘నా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు. మంత్రులు కమిషన్ తీసుకుంటారని కామన్‌గా చెప్పాను. బీఆర్‌ఎస్ పెయిడ్ వాళ్ళు కావాలని దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు కమిషన్ తీసుకొని పనులు చేశారు. గత బీఆర్ఏస్ పార్టీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి. మంత్రి కాకముందు మీ ఆస్తులు ఎంత ఇప్పుడు మీ ఆస్తులు ఎంత పెరిగిందో ఎంక్వయిరీ చేయించండి. నిజాలు బయటకు వస్తాయి’ అని అన్నారు.
గోరంతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్‌తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌ను కావాలని ట్రోల్ చేస్తున్నారన్నారు. కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారని.. పని చేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను పేదలకు అందాలని మాత్రమే సర్కార్ చూస్తోందన్నారు. పారదర్శకంగా ప్రభుత్వం నడుపుతుంటే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ పరిస్థితులు తయారు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమని విమర్శించారు.
ప్రతి చిన్న ఫైల్‌కు డబ్బులు తీసుకున్న తీరు తయారైందన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రిని అయ్యానన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా.. ఎక్కడికి వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. మంత్రులు తప్పు చేశారని ట్రోల్ చేస్తున్న వాళ్ళు వెంటనే ఆపకపోతే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ వాళ్లకు తాము ఏది మాట్లాడినా బూతుగా చూస్తున్నారన్నారు. ‘కవిత ఏమంది నాకు ఇళ్లేలేదు అన్నారు.. మరి కవితకు ఇంత పెద్ద ఇల్లు ఎలా వచ్చింది’ అని ప్రశ్నించారు. ఇలా అవినీతికి పాల్పడి తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీన్ని సహించేది లేదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్.. అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు
Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన
Read Latest Telangana News And Telugu News