Share News

MP Chamala: యూట్యూబ్ చానల్స్‌తో కేటీఆర్ తప్పుడు ప్రచారం...

ABN , Publish Date - May 16 , 2025 | 02:06 PM

Congress vs BRS: మాజీ మంత్రి కేటీఆర్ మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో కాళ్లు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీదని.. జనాన్ని తప్పుదోవ పట్టించాలని కేటీఆర్ రోజు ఎదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

MP Chamala: యూట్యూబ్ చానల్స్‌తో కేటీఆర్ తప్పుడు ప్రచారం...
Congress vs BRS

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి (Ex Minister) కల్వకుంట్ల తారకరామారావు (KTR) వ్యాఖ్యలకు భువనగిరి (Bhuvanagiri) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) కౌంటర్ (Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎంపీ గాంధీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సైకో రాము (కేటీఆర్) కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని.. రామప్పగుడి దగ్గర అత్యుత్సాహంతో ఎవరో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లు కడిగి ఉండవచ్చునని, దానికి తెలంగాణ మహిళల ఆత్మ గౌరవం ఏమైందంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ట్విట్ చేశారని మండిపడ్డారు. పదేళ్లు వాళ్ల ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.


ఇప్పుడు కేటీఆర్ మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో కాళ్లు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీదని.. జనాన్ని తప్పుదోవ పట్టించాలని కేటీఆర్ రోజు ఎదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తుంటే.. కేటీఆర్ డిస్టర్బ్ చేస్తున్నారని, గతంలో దండుకున్న వందల కోట్ల రూపాయలతో కొన్ని యూట్యూబ్ చానల్స్‌తో.. మార్పింగ్ వీడియోలతో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ ఏ సందర్భంలో మాట్లాడారో దానికి ఆమె సమాధానం చెబుతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Also Read: లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంలో చుక్కెదురు


కాగా శుక్రవారం ఉదయం మాజీ మంత్రి హరీష్‌రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు హరీష్‌రావు ఇంటిలో ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న హరీష్‌రావు తండ్రి ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కిలేడీలతో జాగ్రత్త: పోలీసులు

ఏఐజీ ఆస్పత్రికి అందాల భామలు...

For More AP News and Telugu News

Updated Date - May 16 , 2025 | 03:42 PM