Share News

Hyderabad: మాజీఎంపీ మధుయాష్కీ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

ABN , Publish Date - May 16 , 2025 | 11:09 AM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకే మళ్లించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. అయినా.. ఆ ప్రాజెక్టు నిర్మాణంలోనే దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అక్రమాలు చేసిందన్నారు.

Hyderabad: మాజీఎంపీ మధుయాష్కీ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

  • నిధులను మొత్తం కాళేశ్వరానికే మళ్లించారు.. అయినా..

  • మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌(Madhu yashki Goud) ఆరోపించారు. సాగర్‌ రింగ్‌రోడ్‌ చౌరస్తాలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ప్లైఓవర్‌ లూప్‌ను గురువారం జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు సుజాతానాయక్‌తో కలిసి మధుయాష్కీ పరిశీలించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కర్రలతో కొట్టి.. కత్తులతో పొడిచి..


city6.2.jpg

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం, పది రోజుల్లో ప్లైఓవర్‌ పనులు పూర్తవుతాయని, వాహనదారులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఎల్బీనగర్‌ నుంచి వచ్చే వాహనాలు కర్మన్‌ఘాట్‌, చంపాపేట, సంతోష్‏నగర్‌ వైపు వెళ్లేందుకు సులభతరం కానుందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ జైపాల్‌రెడ్డి, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, డేరంగుల కృష్ణ, తోకటి కిరణ్‌, ప్రవీణ్‌రెడ్డి, కందికంటి శ్రీధర్‌గౌడ్‌, సుధీర్‌ పాల్గొన్నారు.


సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

వనస్థలిపురం: ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. వనస్థలిపురం డివిజన్‌కు చెందిన బొడ్డు సరోజ, జక్కర్తి మారెమ్మలు అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం అధిక మొత్తంలో ఖర్చులు అయ్యాయి. దీంతో ఆర్థిక సమస్యల దృష్ట్యా వారు కాంగ్రెస్‌ వనస్థలిపురం డివిజన్‌ అధ్యక్షుడు కుట్ల నర్సింహయాదవ్‌ ఆధ్వర్యంలో మధుయాష్కీగౌడ్‌ సహకారంతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన ఆ చెక్కులను గురువారం బాధిత కుటుంబాలకు మధుయాష్కీ వనస్థలిపురం కాంగ్రెస్‌ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు రామారావు, అశోక్‌గౌడ్‌, సత్యనారాయణ, సదాశివుడు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..

తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు

ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్‌

ఆర్టీసీ సీసీఎస్‌లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - May 16 , 2025 | 11:33 AM