KTR: పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్
ABN , Publish Date - May 16 , 2025 | 04:23 AM
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రకృతి విధ్వంసం, రూ.10 వేల కోట్ల అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రకృతి విధ్వంసం, రూ.10 వేల కోట్ల అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై గురువారం విచారణ సందర్భంగా అధికారులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి మూర్ఖత్వంతో అధికారులు జైలుశిక్ష అనుభవించే పరిస్థితి నెలకొందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్‌రెడ్డి తప్పులను ఒప్పుకుని, అక్కడ బుల్డోజర్లతో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలని, లేదంటే ఆయనకూ కోర్టు శిక్షలు తప్పవన్నారు.