Share News

Gold And Silver Rate: బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..

ABN , Publish Date - May 16 , 2025 | 06:46 AM

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 93930 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 86100 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 70450 దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate: బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..
Gold And Silver Rate

బంగారం ధరలు ఆకాశం నుంచి అథ: పాతాళానికి పడిపోతున్నాయి. నెల క్రితం లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర నేడు 93 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే వారికి ఇంతకు మించిన శుభవార్త ఏముంటుంది. మార్కెట్ పరిస్థితిని చూస్తే.. మరికొన్ని రోజులు బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకుంటున్న వారు ఆలస్యం చేయకుండా కొనిపెట్టుకుంటే మంచిది. లేదంటే మళ్లీ బంగారం పెరిగే అవకాశం ఉంటుంది.


ఈ రోజు బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 93930 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 86100 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 70450 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 93920 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 86090 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 70440 దగ్గర ట్రేడ్ అవుతోంది.


వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ నగరంలో నిన్న 100 గ్రాముల వెండి ధర 10800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,08,000 దగ్గర ట్రేడ్ అయింది. రోజు లాగే ఈ రోజు కూడా 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 10790 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,08,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

బీసీ వాదం ఇప్పుడు వీస్తున్న గాలి

కళా విద్యను విస్మరిస్తున్న ప్రభుత్వం

Updated Date - May 16 , 2025 | 06:46 AM