కళా విద్యను విస్మరిస్తున్న ప్రభుత్వం
ABN , Publish Date - May 16 , 2025 | 06:10 AM
విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్ర పాలకులపై దుమ్మెత్తి పోసిన స్వరాష్ట్ర పాలకులు కూడా వారినే అనుసరించారు. విద్యావ్యవస్థలో మార్పుల కోసం తెచ్చిన విద్యాహక్కు చట్టం, నూతన విద్యా విధానాల లక్ష్యం నెరవేరడం లేదు...
విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్ర పాలకులపై దుమ్మెత్తి పోసిన స్వరాష్ట్ర పాలకులు కూడా వారినే అనుసరించారు. విద్యావ్యవస్థలో మార్పుల కోసం తెచ్చిన విద్యాహక్కు చట్టం, నూతన విద్యా విధానాల లక్ష్యం నెరవేరడం లేదు. మూడు దశాబ్దాలకు పైగా ఆర్ట్, క్రాఫ్ట్ విద్యలను విద్యార్థులకు దూరం చేశారు. విద్యార్థి దశలోనే కళా, వృత్తివిద్యలు అత్యంత అవసరమని 2009 విద్యాహక్కు చట్టం చెబుతోంది. భారతీయ సంప్రదాయ కళలతో పాటు నైపుణ్యాలను మెరుగుపరిచి మేకిన్ ఇండియాకు ఊపిరి పోయాలని నూతన విద్యా విధానం కోరుతోంది. అయినా దీని అమలులో గత ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నూతన ఉపాధ్యాయుల నియామకాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల పోస్టులకు నియామకాలు చేపట్టకపోవడం విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయడమే. భారతీయ సంస్కృతులను సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించే విధంగా కళలు ఉపయోగపడతాయి. విద్యార్థికి అంతర్గత ఒత్తిడిని దూరం చేసి, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే కళలకు ప్రాణం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైస్కూళ్లలో
ఈ కళా ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టకపోవడం బాధాకరమైన విషయం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల కోర్సులను పూర్తి చేసి సుమారు మూడు లక్షల మంది నిరుద్యోగులు నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖా మాత్యులు స్పందించి తక్షణమే ఈ పోస్టులను మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో చేర్చి, భర్తీ చేయాలి.
రావుల రాజేశం
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News