Share News

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

ABN , Publish Date - May 15 , 2025 | 05:22 PM

Supreme Court: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు కావడంతో.. వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అత్యున్నత స్థాయి కోర్టులో ఆయనకు చుక్కెదురైంది.

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
Sajjala Bhargav reddy

న్యూఢిల్లీ, మే 15: తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి చుక్కెదురైంది. తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టులో విచారణ దాఖలు చేశారు. భార్గవ్ పిటిషన్‌పై జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌తో కూడన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

అయితే సీనియర్ న్యాయవాదులు ఎవరు అందుబాటులో లేని కారణంగా ఈ కేసు వాయిదా వేయాలని సుప్రీం ధర్మాసనాన్ని సజ్జల భార్గవ్ తరపు న్యాయవాది కోరారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేసు కాబట్టి ట్రయల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని సూచించింది. ఇక్కడ విచారణ కుదరదని తెల్చి చెప్పంది. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది వాదనల కోసం ఈ కేసును వచ్చే వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.


సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణ చేపట్టాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు విచారణ చేట్టమని ఏపీ హైకోర్టు తెలిపింది. ఆ క్రమంలో ఈ పిటిషన్‌కు హైకోర్టు కొట్టేసింది. దీనిని సవాల్ చేస్తూ సజ్జల భార్గవ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణకు కింద కోర్టుకు వెళ్లాలని సూచించింది. అంతేకానీ.. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణ సాధ్యం కాదని స్పష్టం చేసింది.


మరోవైపు మద్యం కుంభకోణం కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డికి మూడు రోజుల పాటు సిట్ అధికారుల కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశించింది. దీంతో గురువారం తొలిరోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. మద్యం పాలసీ రూపకల్పన, డిస్టలరీలకు అనుమతులు,సేల్స్‌కు సంబంధించి ప్రశ్నలను సజ్జల శ్రీధర్ రెడ్డికి సిట్ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది.


అయితే రాజ్ కసిరెడ్డి, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాను పని చేశానట్లు సజ్జల శ్రీధర్ రెడ్డి.. సిట్ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. శుక్రవారం, శనివారం సైతం సిట్ అధికారులు.. సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం విజయవాడ జిల్లా జైలు అధికారులకు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అప్పగించారు.


ఇంకోవైపు.. లిక్కర్ కేసుపై విజయవాడ ఏసీబీ కేసులో ఈడీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు ఈడి పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను ఈడీ తరఫు న్యాయవాది జయప్రకాశ్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశముంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 05:36 PM