Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
ABN , Publish Date - May 15 , 2025 | 03:25 PM
Abhinandan Vardhaman: పహల్గాం ఉగ్రదాడి అనంతరం రైతులతో కలసి వెళ్లిన బీఎస్ఎఫ్ సైనికుడు పుర్ణియా కుమార్ సాహు పాక్ భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో అతడిని పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

న్యూఢిల్లీ, మే 15: పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల ఉద్రిక్తతల నడుమ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన సైనికుడు పూర్ణమ్ కుమార్ సాహూ భారత్ సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో అతడిని పాక్ సైన్యం దాదాపు 20 రోజుల పాటు బంధించి.. మే 14వ తేదీన భారత్‌కు అప్పగించింది. అయితే 2019లో పుల్వామ దాడి జరిగింది. ఆ సమయంలో సైతం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. పాకిస్థాన్ భద్రతా బలగాల చేతికి చిక్కారు. ఆ సమయంలో సైతం అభినందన్ వర్ధమాన్‌కు భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలా కోట్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ సందర్భంగా వింగ్ కమాండర్ నడుపుతోన్న యద్ద విమానం పాక్ భూభాగంలో కూలింది. ఈ సందర్భంగా అభినందన్ వర్దమాన్‌ను పాక్ భద్రత బలగాలు.. చుట్టుముట్టి బంధించాయి. ఈ నేపథ్యంలో యుద్ధంలో దొరికిన జవాన్లను తిరిగి వారిని స్వదేశానికి అప్పగించాలంటూ గతంలో జనీవా ఒప్పందం మేరకు.. అభినందన్ వర్ధమాన్‌కు భారత్‌కు అప్పగించారు.
అయితే పాక్ భద్రతా బలగాలు.. అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించిన వెంటనే అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడిని మానసికంగా లేదా శారీరకంగా ఏమైన హింసించారా అని వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత అతడిని ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి అందజేశారు. ఇక అతడిని యద్ధ విమానాలు నడిపేందుకు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించారు.దీంతో ఆయన కొంత కాలం పాటు కార్యాలయ విధుల్లోనే నిమగ్నమయ్యారు. కొంత కాలం తర్వాత అతడికి ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను నడిపే బాధ్యతను కట్టబెట్టింది.
2004లో ఆర్మీలో అభినందన్ వర్ధమాన్ ప్రవేశించారు. ఆయన తండ్రి గతంలో ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. అలాగే ఆయన సోదరుడు సైతం ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
మన మిస్సైల్స్‌తో కాంగ్రెస్‌కే అధిక బాధలు
For National News And Telugu News