Share News

Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 15 , 2025 | 02:33 PM

Minister Vijay Shah: కల్నల్ సోఫియా ఖురేషీ వివాదంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సారీ చెప్పాల్సిందే అంటూ మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్ షా మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే..

Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
Operation Sindoor

ఇండో-పాక్ ఉద్రిక్తతల సమయంలో శత్రుదేశంతో పోరు గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు కల్నల్ సోఫియా ఖురేషీ. దీంతో ఆమె ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయిపోయారు. ఎవరీ సోఫియా ఖురేషీ అంటూ ఈ భారత సైనికాధికారిణి గురించి అంతా తెలుసుకోసాగారు. ఈ సమయంలో మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఉగ్రవాదుల సోదరి అంటూ ఒక సభలో షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. దీనిపై హైకోర్టు ఆదేశాలతో మంత్రి మీద కేసు నమోదవడమే గాక ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టుకు కూడా చేరింది. ఈ కేసును విచారించేందుకు అంగీకరించిన అత్యున్నత ధర్మాసనం.. విజయ్ షాపై మండిపడింది. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.


సారీ చెప్పండి..

అసలేం మాట్లాడుతున్నారు.. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి అంటూ మంత్రి విజయ్ షాను ఆదేశించింది సుప్రీం కోర్టు. ఇలాంటి అంశాల్లో సున్నితంగా వ్యవహరించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, కల్నల్ సోఫియాను ఉద్దేశించి ఉద్రవాదుల సోదరి అంటూ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో మంత్రి వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుంది హైకోర్టు.


ఎఫ్‌ఐఆర్ నమోదు

శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గానూ విజయ్ షాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకు వెళ్లగా.. ఈ కేసును రేపు విచారించేందుకు సమున్నత న్యాయస్థానం అంగీకరించింది. అంతేగాకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి తీరును తప్పుపట్టింది. కాగా, విజయ్ షా కామెంట్స్‌పై భారీగా విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుత స్థానంలో ఉండి స్త్రీల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ జాతీయ మహిళా కమిషన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఇవీ చదవండి:

పాక్ అణుబాంబులను లాక్కోండి

మన మిస్సైల్స్‌తో కాంగ్రెస్‌‌కే అధిక బాధలు

ఈ అధికారం మీకెవరు ఇచ్చారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 15 , 2025 | 02:38 PM