Share News

Congress: ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

ABN , Publish Date - May 16 , 2025 | 04:33 AM

పార్లమెంట్‌ సభ్యుడు ఈటల రాజేందర్‌కు దిగజారుడు రాజకీయం తగదని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ హితవు చెప్పారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో పలుచన కాకూడదంటే బూతులు మాట్లాడకూడదు.

Congress: ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

  • ఎమ్మెల్యే వాకిటి

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ సభ్యుడు ఈటల రాజేందర్‌కు దిగజారుడు రాజకీయం తగదని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ హితవు చెప్పారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో పలుచన కాకూడదంటే బూతులు మాట్లాడకూడదు. బాధ్యతగా వ్యవహరించాలి. రాత్రికి రాత్రే ఏదో అయిపోవాలనుకునే వారికి ఆ భాష ఉపయోగపడుతుందేమో కానీ ఈటల రాజేందర్‌కు కాదు. సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కొడకా అన్న పదం ఆయన ఉపయోగిస్తారనుకోలేదు. ఇలాంటి భాష, దిగజారుడు రాజకీయం ఈటలకు సరికాదు’ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఈటల నుంచే హుందాతనం, ఒదిగి ఉండే లక్షణం తాము నేర్చుకున్నామని, కానీ ఆయనపైనే తాము మాట్లాడాల్సి వస్తుందనుకోలేదన్నారు. ఈటలపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి తన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదన్న శ్రీహరి.. సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సన్నవడ్లకు బోనస్‌, రేషన్‌ కార్డుపై సన్న బియ్యం పథకంతోపాటు రైతులకు రుణ మాఫీ చేసినందుకు రేవంత్‌ సర్కారు పడిపోతుందా? అని ఈటలను నిలదీశారు.


భూ కబ్జాదారు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి: మేఘారెడ్డి

నిరంజన్‌రెడ్డి భూకబ్జాదారని, కృష్ణా నదిని పూడ్చేసి భూమి కబ్జా చేశాడని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. దీనిపై గద్వాల-జోగుళాంబ జిల్లా కలెక్టర్‌ విచారణలో మానవపాడు మండలం చండూరు గ్రామంలో 57వ సర్వే నంబర్‌ పరిధిలో 2:19ఎకరాల భూమి కబ్జా చేసినట్లు తేలిందన్నారు. భూకబ్జా పైళ్లను మాయం చేయడానికి ఎమ్మార్వో కార్యాలయాన్నే తగులబెట్టి చరిత్ర ఆయనదన్నారు. నిరంజన్‌రెడ్డి వల్లే ప్రభుత్వానికి రూ.650కోట్ల బకాయిలు ఉండటంతో వనపర్తిలోని 150 రైస్‌మిల్లులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 04:33 AM