ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP MLA Raja Singh: కాళేశ్వరంపై మా నిర్ణయమిదే.. రాజాసింగ్ హాట్ కామెంట్స్

ABN, Publish Date - Jun 23 , 2025 | 04:41 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని ఏటీఎం లాగా బీఆర్ఎస్ నేతలు వాడుకున్నది వాస్తవం కాదా అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలే తమ స్టాండ్ అని రాజాసింగ్ ప్రకటించారు.

BJP MLA Raja Singh

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలకు (BRS Leaders) బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే గులాబీ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఇవాళ(సోమవారం) ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టే‌నని ఆయన ఆరోపించారు.

అందులో బీజేపీది, తమ నేతలది ఒకే అభిప్రాయమని రాజాసింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని ఏటీఎం లాగా బీఆర్ఎస్ నేతలు వాడుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలే తమ స్టాండ్ అని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్‌ని రీడిజైన్ పేరుతో రూ.1.20 లక్షల కోట్లు పెంచలేదా అని నిలదీశారు. ఆనాడు స్వయం ప్రకటిత ఇంజనీర్‌గా అవతారం ఎత్తి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని చేపడితే.. ఈనాడు కేటీఆర్ ఎన్డీఎస్‌ఏ కంటే తానే తెలివైన మేధావిగా ప్రవర్తించడం సిగ్గుచేటని రాజాసింగ్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

యూఎస్‌ను హెచ్చరించిన ఇరాన్

ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ

For More Telangana News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 04:51 PM