Share News

Darmapuri Arvind: ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:17 AM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్‌లో పర్యటిస్తారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారన్నారు.

Darmapuri Arvind: ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ
BJP MP Dharmapuri Arvind

నిజామాబాద్, జూన్ 23: బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఓటమి తప్పదన్నారు. ఆ ఎన్నికల్లో హరీష్ రావు తప్ప ఎవరూ విజయం సాధించరని ఎంపీ ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు.


ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం బెదిరించి.. సాయంత్రం మిలాఖత్ అయితే.. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవంటూ మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ విలేకర్లతో మాట్లాడుతూ.. జూన్ 29వ తేదీన నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారని తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారని చెప్పారు. నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కొత్త శకం ప్రారంభమైందన్నారు. అలాగే దివంగత నేత డి. శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు వివరించారు. అనంతరం స్థానిక పాలిటెక్నీక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళనం పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

యూఎస్‌ను హెచ్చరించిన ఇరాన్

శిక్షించి తీరుతాం: ఇరాన్

For More Telangana News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 11:31 AM