Share News

Iran: శిక్షించి తీరుతాం: ఇరాన్

ABN , Publish Date - Jun 23 , 2025 | 08:54 AM

ఇరాన్‌‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది. అనంతరం ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ స్పందించారు.

Iran: శిక్షించి తీరుతాం: ఇరాన్
Iranian Supreme Leader Ayatollah Ali Khamenei

టెహ్రాన్, జూన్ 23: ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఆ క్రమంలో ఇరాన్‌లోని మూడు అణు శుద్ది కేంద్రాలపై ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా దాడి చేసింది. అలాంటి వేళ ఇరాన్ కీలక నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. అయితే అమెరికా దాడులను ఆయన ఎక్కడా ప్రస్తావించ లేదు. జియోనిస్ట్ శత్రువు పెద్ద తప్పు చేశారన్నారు. ఇంకా చెప్పాలంటే అతిపెద్ద నేరం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతడిని శిక్షించవలసి ఉందని స్పష్టం చేశారు. శిక్షించి తీరుతామని తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ వేదికగా ఖమేనీ స్పందించారు. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌ అణు కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించింది. అనంతరం ఖమేనీ పైవిధంగా ప్రతిస్పందించారు.


ఇక వైట్ హౌస్ వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు కేంద్రాల సామర్థ్యాన్ని నాశనం చేయడమేనని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తున్న జాబితాలో ఇరాన్ అగ్రస్థానంలో ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. అలాంటి దేశంలోని అణు నిల్వల సామర్థ్యాన్ని నాశనం చేయడం ఒక్కటే మార్గమన్నారు. తద్వారా అణు యద్ధ భయానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుందని చెప్పారు.


అయితే ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు చర్చలు జరిపేందుకు అమెరికా రెండు వారాల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రెండు రోజులకే అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకుని ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌పై దాడులకు దిగింది. అయితే అమెరికా కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా.. ఇరాన్‌పై ట్రంప్ దాడికి దిగడం గమనార్హం. మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమన్ నెతన్యాహు.. అమెరికాను ప్రశంసలతో ముంచెత్తారు.

ఇవి కూడా చదవండి:

వైసీపీ కార్యకర్తలపై జగన్ కామెంట్ల ప్రభావం

తెలంగాణలో రచ్చ రేపుతూన్న ఓ డైలాగ్..

For More International News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 12:26 PM