Share News

Rappa Rappa: వైసీపీ కార్యకర్తలపై జగన్ కామెంట్ల ప్రభావం

ABN , Publish Date - Jun 23 , 2025 | 08:00 AM

YCP: ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో ఆయన నోటి నుంచి వచ్చిన ‘రప్పా రప్పా’ డైలాగ్ ప్రభావం ఆ పార్టీ కార్యకర్తలపై పడింది. దీంతో వారు పేట్రేగిపోతున్నారు. రప్పా రప్పా అని నరికితే మంచిదేనన్న జగన్ కామెంట్లతో సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.

Rappa Rappa: వైసీపీ కార్యకర్తలపై జగన్ కామెంట్ల ప్రభావం
Jagan Comments

Amaravati: ఏపీ (AP) లో వైసీపీ కార్యకర్తలు (YCP Activists) రోజు రోజుకు పేట్రేగిపోతున్నారు. ‘రప్పా రప్పా’ (Rappa Rappa) నరికితే మంచిదేనన్న జగన్ కామెంట్ల (Jagan Comments)తో ఆ పార్టీ కార్యకర్తలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. విధ్వంసం జరగాల్సిందేనంటూ సోషల్ మీడియా (Social Media)లో పోస్టులు పెడుతూ వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. వేట తలలు నరకాల్సిందేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన పోస్టింగ్‌లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంగా మారాయి. వీటన్నింటిని చూస్తుంటే వారు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీసీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులు దృష్టి సారించారు.


ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో ఆయన నోటి నుంచి వచ్చిన ‘రప్పా రప్పా’ డైలాగ్ ప్రభావం ఆ పార్టీ కార్యకర్తలపై పడింది. దీంతో వారు పేట్రేగిపోతున్నారు. వేట తలను నరికి జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన విజువల్సును సోషల్ మీడియా, ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసారు. పుష్ప సినిమాలో అమ్మో రేణుక తల్లి పాట పాడుతూ.. కత్తులు, వేటకొడవళ్లతో డ్యాన్సులు చేసిన వైసీపీ యువ కార్యకర్తలు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌‌లకు హెచ్చరికలు చేస్తూ పోస్టింగులు పెట్టారు.


కాగా పుష్ప -2 మూవీలో హీరో చెప్పిన రప్పా.. రప్పా.. డైలాగ్ జగన్ పల్నాడు టూరులో వైసీపీ కార్యకర్తలు వైరల్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రత్యర్థుల అంతు చూస్తామని అర్థం వచ్చేలా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలాంటి చర్యలను ఖండించాల్సిన జగన్ నరికితే తప్పేంటంటూ నిస్సిగ్గుగా సమర్థించారు. కాగా ఇప్పుడు ఈ డైలాగ్ ఏపీతోనే ఆగిపోతుందని అనుకుంటే... తెలంగాణకు కూడా పాకింది. పుష్ప సినిమా వచ్చిన ఆరు నెలల తర్వాత.. ఈ డైలాగ్ మళ్లీ రాజకీయాల్లో పాపులర్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడో రాబోయే ఎన్నికల కోసం.. ఇప్పటి నుంచే ఇలాంటి డైలాగులున్న ప్లెక్సీలు జనంలో కనిపిస్తుండటం.. కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయనే చర్చ జరుగుతోంది.


ఇవి కూడా చదవండి:

తెలంగాణలో రచ్చ రేపుతూన్న ఓ డైలాగ్..

అమెరికా అస్త్రాలివే

జగన్‌ కారు కింద నలిగిన మానవత్వం

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 23 , 2025 | 08:40 AM