ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pak Ceasefire Violation: పాక్ గాలి తీసిన చాహల్.. గట్టిగా ఇచ్చిపడేశాడు

ABN, Publish Date - May 11 , 2025 | 08:38 AM

Pak Breaks Ceasefire: కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్దిసేపటికే పాకిస్థాన్ మళ్లీ నక్క బుద్ధి చూపించింది. భారత భూభాగాల మీద దాడికి దిగింది. ఈ విషయంపై టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రియాక్ట్ అయ్యాడు. అతడేం అన్నాడంటే..

Yuzvendra Chahal

పాకిస్థాన్ మాట తప్పింది. సీజ్‌ఫైర్‌కు అంగీకరించిన శత్రుదేశం.. కొద్దిసేపటికే కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. భారత భూభాగాల మీద అటాక్ చేసింది. శనివారం రాత్రి జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు కనిపించాయి. అయితే వాటిని భారత సైన్యం గాల్లోనే కూల్చేసింది. శ్రీనగర్, అఖ్నూర్, పింజార్, బారాముల్లా, అనంత్‌నాగ్, బట్వారాలోనూ పాక్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. పాక్ కాల్పుల ఉల్లంఘనలను కేంద్ర సర్కారు కూడా ధృవీకరించింది. తాజాగా ఈ విషయంపై టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించాడు. పాక్ గాలి తీసేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..


జన్మలో బుద్ధి రాదు..

పాక్‌ స్వభావం మారదంటూ సీరియస్ అయ్యాడు చాహల్. శత్రుదేశాన్ని కుక్క తోకతో పోల్చాడు చాహల్. కుక్క తోకకు రాయి కట్టినా దాని తీరు మారదని.. అది వంకరగానే ఉంటుందన్నాడు. పాక్‌కు బుద్ధిరాదని సెటైర్ వేశాడు. చాహల్‌తో పాటు మరో క్రికెటర్ రాహుల్ తెవాటియా, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కుక్క తోక వంకర.. అది మారదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సేమ్ పోస్ట్ షేర్ చేశారు. చెత్త దేశం తమ నిజస్వరూపం ఏంటో అందరి ముందు మరోమారు చూపించిందంటూ పాక్‌ను దుయ్యబట్టారు మరో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్. ఇలా పలువురు టీమిండియా స్టార్లు సీజ్‌ఫైర్‌ మీద తమదైన రీతిలో స్పందించారు. భారత స్టార్ల రియాక్షన్‌పై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌ను ఎంత తిట్టినా తప్పులేదని.. యుద్ధం చేతగాక కాళ్లబేరానికి వచ్చారని అంటున్నారు. సీజ్‌ఫైర్‌కు ఒప్పించి ఉల్లంఘించడం ఏంటని సీరియస్ అవుతున్నారు.


ఇవీ చదవండి:

ఇక విరాట్‌ వంతు

మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్‌

టెస్ట్‌ జట్టు సారథిగా గిల్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 08:43 AM