టెస్ట్ జట్టు సారథిగా గిల్
ABN , Publish Date - May 11 , 2025 | 05:34 AM
సుదీర్ఘ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. భారత టెస్ట్ జట్టు సారథిగా శుభ్‌మన్ గిల్, ఉప నాయకుడిగా రిషభ్ పంత్ ఎంపిక ఖాయమైనట్టు తెలిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో కొన్ని టెస్ట్‌లకు...

వైస్ కెప్టెన్ పంత్?
న్యూఢిల్లీ: సుదీర్ఘ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. భారత టెస్ట్ జట్టు సారథిగా శుభ్‌మన్ గిల్, ఉప నాయకుడిగా రిషభ్ పంత్ ఎంపిక ఖాయమైనట్టు తెలిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో కొన్ని టెస్ట్‌లకు రోహిత్ స్థానంలో పేసర్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ తరచూ గాయాలతో బాధపడే బుమ్రా ఇంగ్లండ్‌తో పూర్తిగా ఐదు టెస్ట్‌లు ఆడే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో అతడిని సారథిగా ఎంపిక చేసే అవకాశం లేదు. అలాగే కెప్టెన్‌గా చేసిన బుమ్రాను వైస్-కెప్టెన్‌గా నియమించడం సబబు కాదని బోర్డు ఆలోచిస్తోంది. దాంతో గిల్‌ను సారథిగా ఎంపిక చేస్తే..పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించాలని సెలెక్టర్లు, బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ పేరు వినిపించినా, ఇప్పటికే 33 ఏళ్ల వయసున్న అతడిని భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగా చూడలేమని బోర్డు భావించిందట.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.