Exams: ‘పది’పై పరేషాన్.. ఆ టీచర్లకు పరీక్షే..
ABN, Publish Date - Nov 29 , 2025 | 12:09 PM
ప్రైవేట్ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్‌గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.
- ఉత్తీర్ణత శాతం పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు
- యాజమాన్యాల ఆదేశాలతో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ సిటీ: పదో తరగతి పరీక్షలు జిల్లాలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు సవాల్‌గా మారాయి. ప్రతి సబ్జెక్టులో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని పలు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీచేస్తున్న తరుణంలో టీచర్లు సతమతమవుతున్నారు. తరగతి గదిలో పాఠాలు బోధిస్తుండడంతోపాటు విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత వారితో ఫోన్‌లో మాట్లాడడం, సందేహాలను నివృత్తి చేయడం లాంటివి చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఎస్ఎస్‌సీ బోర్డు కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అటు పాఠశాలలో, ఇటు ఇంటిలో విద్యార్థులపై టీచర్లు, తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించారు.
సబ్జెక్టుల్లో ఫెయిలైతే చర్యలు
పదో తరగతి పరీక్షలు విద్యార్థుల కంటే వారికి పాఠాలు బోధించే టీచర్లకే సవాల్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఇందుకు పలు పాఠశాలల్లో యాజమాన్యాలు పెడుతున్న కండీషన్లే ఉదాహరణగా నిలుస్తున్నాయి. సబ్జెక్టుల్లో వందశాతం పాస్‌కావడంతో పాటు విద్యార్థులు బైకి బై మార్కులు సాధించేందుకు కృషి చేసిన టీచర్లకు ప్రత్యేక బహుమతులు ఇస్తామని, వేతనాల పెంపు కచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నారు.
విద్యార్థులు ఫెయిలైతే అందుకు బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. ప్రైవేట్ టీచర్లకు ఆయా యాజమాన్యాలు జారీ చేసిన హెచ్చరికల మాదిరిగానే విద్యాశాఖాధికారులూ సర్కారు ఉపాధ్యాయులకు సూచిస్తున్నారు. పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 29 , 2025 | 12:52 PM