Minister Srinivas: పాకిస్తాన్‌లోని ఆంధ్రులు స్వదేశానికి రావాలి
ABN, Publish Date - Apr 25 , 2025 | 02:59 PM
Minister Kondapalli Srinivas: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు కూడా త్వరగా ఇస్తామని తెలిపారు.
విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎవరైనా పాకిస్తాన్‌లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి అడ్డంకులు ఉన్నట్లయితే ఎన్నారై విభాగం ద్వారా పరిష్కరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాకిస్తాన్‌లో ఉన్న ఆంధ్రులు స్వదేశానికి తిరిగి వస్తే వారి నైపుణ్యతను అనుసరించి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ నుంచి స్పాంజ్ పెన్షన్లు ఇస్తున్నామని.. భర్త చనిపోయిన మొదటి నెలలోనే పెన్షన్ ఇస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 30 వేలమంది వితంతువులకు పెన్షన్ కొత్తగా ఇవ్వడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న మరో 90 వేల మందికి కూడా వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.35 కోట్లు అదనపు భారం పడనుందని చెప్పారు. డెత్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు తీసుకుని ఫించన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులు అందరూ ఈ నెల 30వ తేదీకి ధ్రువపత్రాలు అందజేయాలని సూచించారు. ఏపీవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలని ఆలోచన చేసి ఆ దిశగా ఆచరణ చేస్తున్నామని అన్నారు. వచ్చే నెల ఒకటో తేదీన నెల్లూరులో ఒక పార్కును ప్రారంభించి అక్కడి నుంచే వర్చువల్‌గా మరొక 50 పార్కులను ప్రారంభిస్తామని తెలిపారు. రెండేళ్లలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
AP NEWS: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..
Deputy CM Pawan Kalyan: ఇక స్థానిక ప్రభుత్వాలు
Visakhapatnam: రెండున్నర గంటలు పరుగెడుతూనే ఉన్నాం
Controversial Cases: అంతా ‘ఒక్క’టయ్యారు
Kashmir Terror Attack: ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి
For More AP News and Telugu News
Updated Date - Apr 25 , 2025 | 03:22 PM