Share News

Controversial Cases: అంతా ‘ఒక్క’టయ్యారు

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:05 AM

మద్యం కుంభకోణం, మహిళపై కుట్ర, కిడ్నాప్‌ కేసుల్లో ఇరుక్కున్న ముగ్గురు 'జగన్‌' మనుషులు విజయవాడ జిల్లా జైలులో ఒకే బ్యారక్‌లో ఉంచబడ్డారు. వీరిలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆంజనేయులు, ముదునూరి సత్యవర్థన్‌ ఉన్నారు.

Controversial Cases: అంతా ‘ఒక్క’టయ్యారు

ఒకే జైలు, ఒకే బ్యారక్‌లో జగన్‌ ‘గ్యాంగ్‌’

రాజ్‌ కసిరెడ్డి, పీఎ్‌సఆర్‌, వంశీ అక్కడే

ముగ్గురి సెల్స్‌లో సీసీ కెమెరాలు

విజయవాడ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఒకరిది మద్యం మాయ. మరొకరిది మహిళపై కుట్ర. ఇంకొకరిది కిడ్నాప్‌ కిరికిరి. ఈ మూడు కేసుల్లో ఇరుక్కున్న ముగ్గురు ‘జగన్‌’ మనుషులు జైలులో ఒక్కటయ్యారు. మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో అరెస్టయిన పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ఒకరోజు వ్యవధిలో విజయవాడ జిల్లా కారాగారానికి వెళ్లారు. వారి కంటే ముందునుంచే గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి ముదునూరి సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అదే జైలులో ఉంటున్నారు. ఈ ముగ్గురినీ జైలులో ఒకే బ్యారక్‌లో ఉంచడం విశేషం. జిల్లా జైలులో మూడు బ్యారక్‌లు ఉన్నాయి. ఒకటో నంబరు బ్యారక్‌లో 11 గదులు ఉన్నాయి. రెండో నంబరు బ్లాక్‌లో రెండు గదులు, మూడో నంబరు బ్లాక్‌లో మరో రెండు గదులు ఉన్నాయి. ఈ రెండు, మూడు బ్లాక్‌లను ప్రముఖలకు కేటాయిస్తారు. మిగిలిన వారిని వివిధ సెల్స్‌లోకి పంపుతారు. వల్లభనేని వంశీని ఒకటో నంబరు బ్యారక్‌లో ఉంచారు. ఇక.. రాజ్‌ కసిరెడ్డికి ఇదే బ్యారక్‌లో వేరే సెల్‌ కేటాయించారు. పీఎ్‌సఆర్‌ను కూడా ఇదే నంబరు బ్యారక్‌లోని మరో సెల్‌కు పంపారు. వైసీపీ హయాంలో విర్రవీగిన వారిలో ఒకరి తర్వాత ఒకరు జైలుకు క్యూ కడుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 05:05 AM