ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gandi Babji: ఆస్తి కోసం తల్లి, చెల్లికి జగన్ వెన్నుపోటు పొడిచాడు: గండి బాబ్జి

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:57 PM

వైసీపీ అధినేత జగన్.. తన బాబాయ్ హత్యకి గొడ్డలి పోటు పొడిచారని.. ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జి విమర్శించారు. సొంత చెల్లికి, తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ సర్వనాశనం అయిందని గండి బాబ్జి విమర్శించారు.

Gandi Babji slams YS Jagan

విశాఖపట్నం: వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డినే (YS Jaganmohan Reddy) పెద్ద వెన్నుపోటు దారుడని ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జి (Gandi Babji) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఇవాళ(మంగళవారం) విశాఖపట్నంలో గండి బాబ్జి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో గండి బాబ్జి మాట్లాడారు. శివ కుమార్‌కి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని జగన్ తీసుకున్నారని మండిపడ్డారు గండి బాబ్జి.


వివేకా(బాబాయ్)హత్యకి గొడ్డలి పోటు పొడిచి...ఇప్పుడు వెన్నుపోటు దినం, పోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని గండి బాబ్జి విమర్శించారు. సొంత చెల్లికి, తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ సర్వనాశనం అయిందని చెప్పారు. పెన్షన్ రూ. 4 వేలు చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రూ. 1000 పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ప్రకటించారు. జగన్ హయాంలో అమరావతిని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. మూడు రాజధానులని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్, ఉచిత గ్యాస్ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 70 శాతం హామీలు అమలు చేశామని గండి బాబ్జి పేర్కొన్నారు.


గొడ్డలి పోటును పేటెంట్‌గా తీసుకుంది జగనే: రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి

వైఎస్ కుటుంబం వెన్నుపోటును, గొడ్డలి పోటును పేటెంట్‌గా తీసుకుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(మంగళవారం) అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. గతంలో రాజారెడ్డి.. గనుల్లో ఉపాధి కల్పించిన వెంకట నర్సయ్యను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి పీవీ నరసింహారావును వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. జగన్ తన కన్నతల్లి, సొంత చెల్లికి ఆస్తి కోసం వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వివేకాహత్య కేసు నిందితులతో అంటకాగుతూ మరో చెల్లి సునీతకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నలవర్షం కురిపించారు. ఐదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు సైతం జగన్ వెన్నుపోటు పొడిచాడని రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెద్దిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

తహసీల్దార్‌ కుటుంబం సేఫ్‌

For More AP News and Telugu News

Updated Date - Jun 03 , 2025 | 01:10 PM