ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ayyannapatrudu: పల్లా సింహాచలం సేవలు మరువలేనివి: అయ్యన్నపాత్రుడు

ABN, Publish Date - Jun 08 , 2025 | 09:25 AM

పల్లా సింహాచలం సేవలు మరువలేనివని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన ప్రజలకు ఎంతగానో సేవలు అందించారని కొనియాడారు.

Ayyannapatrudu

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకి పితృవియోగం కలిగింది. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం(93) (Palla Simhachalam) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో కేర్ ఆస్పత్రిలో సింహాచలం చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శనివారం కేర్ ఆస్పత్రిలో పల్లా సింహాచలం తుది శ్వాస విడిచారు. గాజువాకలోని ఆయన నివాసం వద్ద పల్లా సింహాచలం పార్థివ దేహానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ( Ayyannapatrudu) నివాళి అర్పించారు.


ఈ క్రమంలో సింహచలం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. తాను ఇంటర్ చదువుతున్న సమయంలో సింహచలం నాయకత్వంపై ఇష్టంతో వారిని చూడటానికి విశాఖకు వచ్చే వాడినని గుర్తుచేసుకున్నారు. సింహచలం గొప్ప కార్మిక సంఘ నాయకులని కొనియాడారు. ప్రజలకు, కార్మికులకు నిరంతరం సేవలు అందించారని తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.


టీడీపీ నేతల నివాళి...

పల్లా సింహాచలం పార్థీవదేహానికి విశాఖపట్నం ఎంపీ భరత్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, శాప్ చైర్మన్ రవి నాయుడు, శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరింద్రప్రసాద్. పోలీస్ కమిషనర్ శంకబత్ర బాగ్చిలు, టీడీపీ నేతలు, నియోజకవర్గ ప్రజలు నివాళి అర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు

కన్నప్పలో బ్రాహ్మణులను కించపరిచారు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 09:46 AM